తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. మరోసారి సెంటిమెంటునే నమ్ముకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం.. నాటి పరిస్థితులు.. తెలంగాణ వారికి జరిగిన అవమానాలను ఆయన మరోసారి తెరమీదికి తీసుకురావడం ద్వారా.. ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా జరిగిన బీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. పార్టీ నాయకులకు చేసిన దిశానిర్దేశం వంటివి పక్కాగా సెంటిమెంటు దిశగానే మాజీ సీఎం అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించిన కేసీఆర్.. నాటి సంగతులు.. తమపై పెట్టిన కేసులు.. వంటివాటిని ఎక్కువగా ప్రస్తావించారు. నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో కొట్లాడినమని.. తెలంగాణ ప్రజల కోసం అనేక అవమానాలు ఎదుర్కొన్నమని ఆయన చెప్పడం ద్వారా కేసీఆర్ ప్రజల మనసులను తట్టే ప్రయత్నం చేశారు. నాడు పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కి వెళ్లిపోతోందని చెప్పడం ద్వారా.. ప్రజల మనోభావాలపై బలమైన ముద్ర వేసే యత్నం చేశారనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమం కోసం తన కుటుంబం యావత్తు రోడ్డెక్కిందని.. చెప్పిన కేసీఆర్.. పరోక్షంగా ప్రత్యర్థి పార్టీలను గురిపెట్టారు.
భారీ టార్గెట్లు..
ఇక, ఈ సమావేశంలో పార్టీ నాయకులకు కేసీఆర్ భారీ టార్గెట్లు విధించారు. పార్టీని సంస్థా గతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉధృతం చేయాలని.. తద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఈ బాధ్యతలను మాజీ మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. ఇక, ఏప్రిల్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
This post was last modified on February 19, 2025 8:17 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…