టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయంగా, పాలనా పరంగా సత్తా చాటుతున్నారు. 42 ఏళ్ల వయసుకే పార్టీకి రికార్టు విక్టరీ అందించిన లోకేశ్.. గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీని చేజిక్కించుకున్నారు. తనతో కలిసి బరిలోకి దిగిన జనసేన, బీజేపీలకు కూడా రికార్డు విజయాలను అందించి అన్ని పార్టీల దృష్టిని ఆకర్షించారు. పాలనలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిన లోకేశ్.. తనదైన మార్కును చూపుతున్నారు. అటు పార్టీ, ఇటు పాలనలో యమా స్పీడుగా సాగుతున్న లోకేశ్ ఫిట్ నెస్ విషయంలోనూ బాగానే కసరత్తులు చేస్తున్నట్టున్నారు. గతంలో మాదిరి బొద్దు లుక్కును వదిలేసిన లోకేశ్.. ఇప్పుడు తన ఎత్తుకు తగ్గ లావుతో ఫిట్ గా కనిపిస్తున్నారు.
పార్టీ కార్యకర్తలతో సమావేశం నిమిత్తం బుధవారం తిరుపతి వెళ్లిన లోకేశ్.. పార్టీ కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి వెళ్లారు. పద్మావతి వర్సిటీకి మొన్నటిదాకా ఇంచార్జీ వీసీగా కొనసాగిన ప్రొఫెసర్ ఉమను మంగళవారం పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వర్సిటీని ఓ సారి చూసొద్దామనుకున్నారో, ఏమో తెలియదు గానీ… నేరుగా వర్సిటీకి వెళ్లిన లోకేశ్.. అక్కడ స్టూడెంట్స్ తో కలిసి కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మహిళా ప్రొఫెసర్లు, గర్ల్ స్టూడెంట్లతో కలిసి లోకేశ్ కాసేపు షటిల్ ఆడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
సాధారణంగా పాలిటిక్స్ లో ఉన్న వారు ఫిజికల్ గా ఫిట్ కనిపించడం అరుదే. ఒకవేళ ఫిట్ గా ఉన్న ఆయా ఆటలు ఆడటం ఇబ్బందిగా ఫీలవుతారు. అయితే లోకేశ్ లో ఈ రెండూ కనిపించలేదు. షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కు మాదిరిగా ఒడుపుగా రాకెట్ పట్టిన లోకేశ్… చక్కగా షటిల్ ఆడారు. సర్వీస్ చేయడంతో పాటుగా షాట్లు కూడా లోకేశ్ ఎంతో నేర్పు ఉన్న ఆటగాడిలా ఆడారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ తో ఆయన చలాకీగా మాట్లాడుతూ… తాను ఆడుతూ వారిని ఆడిస్తూ అలా సాగిపోయారు. ఇక చివరగా తనతో షటిల్ ఆడిన స్టూడెంట్స్, ప్రొఫెసర్లతో కలిసి ఫొటోలు దిగారు.
This post was last modified on February 19, 2025 4:54 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…