Political News

జైలుకు జ‌గ‌న్‌.. నేతల బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌!

విజ‌య‌వాడ సబ్ జైల్లో ఉన్న వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని తాజాగా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. అయితే.. స‌మ‌యం సంద‌ర్భం లేకుండా.. రాజు వెడ‌లె ర‌వి తేజ‌ముల‌ల‌ర‌గ‌! అన్న‌ట్టుగా జైలుకు కూడా మందీ మార్బ‌లాన్ని వేసుకుని వ‌చ్చేశారు. స్థానిక నాయ‌కులు అయితే.. త‌మ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు జైలునే వేదిక‌గా చేసుకున్నారు. దీంతో విజ‌య‌వాడ నడిబొడ్డున ఉన్న ఈ జైలు ప్రాంతం మొత్తం నారా ర‌భ‌స‌గా మారింది.

విజ‌య‌వాడ గాంధీన‌గ‌ర్‌లోని స‌బ్ జైలులో వంశీ 14 రోజుల రిమాండ్ నిమిత్తం ఉన్న విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌గ‌న్‌.. వంశీని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో స్థానిక నాయ‌కులు త‌మ ప‌రివారంతో స‌హా వ‌చ్చి.. జ‌గ‌న్ ముందు బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగారు. దీంతో కార్య‌క‌ర్త‌లు ర‌హదారుల‌పై హ‌ల్చ‌ల్ చేయ‌డంతోపాటు.. జైలు గేట్లు కూడా నెట్టుకుంటూ లోప‌లికి వెళ్లారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒకే సారి 50 మందికి మించి కార్య‌క‌ర్త‌లు రాకూడ‌దు.

కానీ, తాజాగా 500 మందికి పైగా కార్య‌క‌ర్త‌లు.. జైలు ఆవ‌ర‌ణ‌ను చుట్టుముట్ట‌డంతో పోలీసులు సైతం వారిని నిలువ‌రించలేక చేతులు ఎత్తేశారు. అయితే.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. ఏదైనా దాష్టీకానికి పాల్ప‌డుతారేమోన న్న సందేహాలతో .. చుట్టుప‌క్క‌ల ఉన్న హోట‌ళ్లు, దుకాణాల‌ను తాత్కాలికంగా పోలీసులు మూసి వేయించారు. అదేస‌మ‌యంలో ట్రాఫిక్‌ను కూడా దారి మ‌ళ్లించారు. దీంతో ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థుల‌కు ఇబ్బంది ఏర్ప‌డింది. సాధార‌ణ ప్ర‌యాణికులు కూడా ఇబ్బందులు ప‌డ్డారు.

సుమారు గంట‌న్న‌ర పాటు జ‌గ‌న్‌.. జైలు వ‌ద్ద గ‌డిపారు. మీడియాతో మాట్లాడడంతో పాటు.. 20 నిమిషాలు వంశీతోనూ ఆయ‌న భేటీ అయ్యారు. బ‌య‌ట‌కు వ‌చ్చాక య‌థాలాపంగా స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. రెడ్ బుక్ పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా వైసీపీ నాయ‌కుల‌ను అరెస్టు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on February 19, 2025 9:08 am

Share
Show comments
Published by
Kumar
Tags: JaganYCP

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

60 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

4 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago