మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా తుది ఫలితం వెలువడక ముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ నాని దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన కనిపించిన దాఖలానే లేదని చెప్పాలి. గడచిన 8 నెలలుగా గుడివాడకు దూరంగానే ఉంటున్న నాని… ఎప్పుడన్నా అవసరం అయితే తప్పించి గుడివాడకు రాలేదు. అలా వచ్చిన సందర్భాల్లోనూ చడీచప్పుడు లేకుండా వచ్చిన పనిని క్షణాల్లో పూర్తి చేసుకుని ఆయన వెళ్లిపోయేవారు. ఇక వైసీపీ కార్యక్రమాల్లోనూ ఆయన పెద్దగా కనిపించలేదనే చెప్పాలి.
తాజాగా తన స్నేహితుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయ్యాక కొడాలి మరింతగా గాయబ్ అయిపోయారట. నాని అరెస్టు తర్వాత కొడాలి నాని వంతేనంటూ టీడీపీ శ్రేణులతో పాటుగా వైసీపీ శ్రేణుల్లోనూ గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గుసగుసలు నిజమేనన్నట్టుగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నాని ఏకంగా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గుడివాడలో లేకుంటా హైదరాబాద్ లో ఉంటారులే అని నిన్నటిదాకా నాని అనుచరులు భావిస్తూ వచ్చారు. ఏదైనా ముఖ్య విషయం ఉంటే… ఫోన్ ద్వారా ఆయనకు చేరవేసేవారు. అయితే ఇప్పుడు నానికి ఫోన్ చేద్దామంటూ ఆయన ఫోన్లన్నీ స్విచ్ఛాఫ్ అని వస్తున్నాయట. దీంతో ఇప్పుడు నాని ఎక్కడున్నారని ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారట.
ఇదిలా ఉంటే… వైసీపీ హయాంలో రెండున్నరేళ్ల పాటు మంత్రిగా వ్యవహరించిన నాని… ఆ తర్వాతి రెండున్నరేళ్లు మంత్రిగా లేకున్నా కూడా తనదైన శైలిలో టీడీపీపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా జగన్ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ తో తన నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటినీ ఇప్పుడు కూటమి సర్కారు బయటకు తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే నానిపై గుడివాడలో 3 కేసులు నమోదు అయ్యాయట. తాజాగా వైసీపీ జమానాలో జరిగిన లిక్కర్ దందాపైనా విచారణ జరుగుతోంది. ఇందులోనూ నాని అడ్డంగా బుక్ అవుతారని, ఆ కేసు కూడా నానిపై నమోదు కావడం ఖాయమేనని సమాచారం. ఈ మొత్తం వ్యవహారాలన్నీ తెలుసుకున్న మీదటే నాని అండర్ గ్రౌండ్ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
This post was last modified on February 17, 2025 7:59 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…