టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర పేరిట ఇటీవలే ప్రారంభించిన కార్యక్రమంలో చంద్రబాబు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కందుకూరు మార్కెట్ లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన చంద్రబాబు… పట్టణంలోని పలు ప్రాంతాల్లో పరిశుభ్రతను పరికించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
కందుకూరులో పరిశుభ్రతపై మాట్లాడేందుకు వచ్చిన ఓ బాలిక… చంద్రబాబు సమక్షంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పట్టణంలో పరిశుభ్రత గురించి మాట్లాడిన బాలిక… పట్టణంలో పరిశుభ్రతను అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిపింది. చంద్రబాబు వస్తున్నారని.. శనివారం ఉదయమే అధికారులు పట్టణంలోని చెత్తను తొలగించారని ఆ బాలిక తెలిపింది. అదే చంద్రబాబో, లేదంటే ఇతర ముఖ్య నేతల పర్యటనలు లేకుంటే.,..పట్ఠణంలో చెత్త తొలగింపును యంత్రాంగం అస్సలు పట్టంచుకోవట్లేదని కూడా ఆ బాలిక వెల్లడించింది.
వాస్తవానికి చంద్రబాబు పచ్చదనం-పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. తాను ఎప్పుడు సీఎంగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో బాబు పచ్చదనం-పరిశుభ్రత కాస్తా… స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రగా మారినా.. లక్ష్యం మాత్రం పాతదే.
చంద్రబాబు ఇంత ప్రాధాన్యం ఇస్తున్న ఈ పథకంలో అధికారులు ఎంతగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విషయాన్ని కందుకూరు బాలిక సభా ముఖంగానే కుండబద్దలు కొట్టింది. బాలిక మాటలు విన్న చంద్రబాబు… కందుకూరు మునిసిపల్ అధికారుల పనితీరుపై మదింపు చేసి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 15, 2025 7:16 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…