స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను పక్కన పెట్టింది. ఇక నుంచి ఎంత మంది పిల్లలు ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులేనని పేర్కొంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా న్యాయ శాఖ కూడా ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపుపై గెజిట్ జారీ చేసినట్టయింది.
ఇప్పటివరకు.. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాల్లోని వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ఇది పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం అనుసరిస్తున్న నిబంధన. రాజ్యాంగంలో ఈ మేరకు ఎక్కడా ప్రత్యేక క్లాజ్ లేకపోవడం గమనార్హం. ఇదే నిబంధనను 1973 నుంచి ఉమ్మడిఏపీలోనూ అనుసరిస్తున్నారు. దీంతో చాలా మంది అభ్యర్థులు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతున్నారు.
దీనిపై గ్రామీణ స్థాయిలో ఎప్పటికప్పుడు.. చర్చ జరుగుతూనే ఉంది. అయితే.. దీనిని సవరించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా.. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక.. ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తామని చెప్పారు. దీనికి అనుగుణంగానే గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై స్వల్పకాలిక చర్చ చేపట్టి సభలో ఆమోదించారు. అనంతరం.. ప్రభుత్వం ఈ విషయాన్ని న్యాయశాఖకు రిఫర్ చేసింది. దీనిపై ఎలాంటి వివాదాలు రాకుండా.. నిర్ణయం తీసుకునే బాధ్యతను అప్పగించారు.
దీనిపై సమగ్ర అధ్యయనం చేసిన న్యాయ శాఖ.. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను పంచాయతీరాజ్ చట్టం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా.. ఏపీలో వచ్చే 2026-27లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పోటీ చేసేందుకు అర్హత లభించనుంది.
This post was last modified on February 14, 2025 12:34 pm
గత ఏడాది కల్కి 2898 ఏడి రూపంలో వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు నాగ అశ్విన్ రెండో…
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ…
టాలీవుడ్ బెస్ట్ కమెడియన్స్ పేర్లు రాసుకుంటూ పోతే వాటిలో ఖచ్చితంగా వచ్చే పేరు ఎంఎస్ నారాయణ. కాలం చేసి స్వర్గానికి…
రెండు దశాబ్దాల తర్వాత ఒక ఇండస్ట్రీ హిట్టుకి సీక్వెల్ తీస్తే అది బ్లాక్ బస్టర్ కావడం అరుదు. కానీ గదర్…
దాదాపుగా 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకుంది. ఇటీవల ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు…
ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే… చాలా వింతగా అనిపిస్తోంది. ఎవరు, ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియడం…