Political News

‘సైబర్ క్రైమ్’కు పృథ్వీరాజ్.. ఇంటరెస్టింగ్ కామెంట్స్

సినిమా ఫంక్షన్ లో వైసీపీని టార్గెట్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టలీవుడ్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్… బుధవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు, ఫోన్ మెసేజ్ లతో వైసీపీ యాక్టివిస్టులు తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు వైసీపీ యాక్టివిస్టులపై ఫిర్యాదు చేసినట్టు ఆయన ఆ తర్వాత వెల్లడించారు.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. 11 నెంబర్ వింటేనే వైసీపీ నేతలు హడలిపోతున్నారని ఆయన అన్నారు. తానేమీ వైసీపీని ఉద్దేశించి 11 నెంబరును పలకలేదని తెలిపారు. తానేదో ఓ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన సందర్భంగా ఈ నెంబర్ ను గుర్తు చేసుకున్నానని తెలిపారు. తాను మద్దతు పలికిన క్రికెట్ జట్టులోని 11 మంది క్రీడాకారుడు మంచిగా ఆడారని కూడా ఆయన అన్నారు. అయినా వైసీపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయాలంటే తనకు సినిమా ఈవెంట్లు అవసరం లేదని, వేరే వేదికల మీదే ఆ వ్యాఖ్యలు చేయగలనని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే… టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన సందర్భంగా పృథ్వీరాజ్… 150 గొర్రెలని, చివరలో 11 గొర్రెలే మిగిలాయని సెటైరిక్ గా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు విన్నంతనే వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పృథ్వీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టాయి. ఇక విశ్వక్ సేన్ సినిమాను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో బీపీ పెరగడంతో ఆసుపత్రిలో చేరిన పృథ్వీ… ఆసుపత్రి నుంచే నేరుగా సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కట్టిన హ్యాండ్ బ్యాండేజీలతోనే పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వచ్చారు.

This post was last modified on February 12, 2025 9:48 pm

Share

Recent Posts

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

50 minutes ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

4 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

5 hours ago