Political News

ద‌మ్ముంటే రాజీనామా చెయ్‌: రేవంత్‌కు కేటీఆర్ స‌వాల్‌

బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆయ‌న నిప్పులు చెరిగారు. 14 నెల‌లుగా సీఎం రేవంత్ రెడ్డి పాల‌న సాగిస్తున్నార ని.. కానీ, ఆయ‌న పాల‌న అంతా.. సొంత కుటుంబం కోస‌మే అన్న‌ట్టుగా ఉంద‌ని వ్యాక్యానించారు. సొంత కుటుంబానికి ప్ర‌జ‌ల ఆస్తులు దోచిపెడుతున్నార‌ని అన్నారు. అల్లుడి కోసం ల‌గ‌చ‌ర్ల భూములు గుండు గుత్త‌గా రాసిచ్చేశార‌ని ఆరోపించారు.

“ల‌గ‌చ‌ర్ల భూములు లాక్కుని అల్లుడికి క‌ట్నం కింద రాసిచ్చేశాడు. 14 నెల‌లుగా త‌న సొంత కుటుంబం కోసం.. పాల‌న చేస్తున్నాడు“ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ద‌మ్ముంటే.. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి రాజీనామా చేయాల‌ని స‌వాల్ రువ్వారు. త‌మ అభ్య‌ర్థి న‌రేంద్ర రెడ్డిని నిల‌బెడ‌తామ‌ని.. 50 వేల ఓట్ల మెజారిటీతో ప్ర‌జ‌లే న‌రేంద్ర‌రెడ్డిని గెలిపించుకుంటార‌ని వ్యాఖ్యానించారు. ఒక వేళ ఒక్క ఓటు త‌క్కువ వ‌చ్చినా.. తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటానని కేటీఆర్ స‌వాల్ రువ్వారు.

కాంగ్రెస్ పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు జ‌రిగింది మేలు కాద‌ని.. బూడిద‌ని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. ఎక్క‌డిక‌క్క‌డ పందికొక్కుల్లా కాంగ్రెస్ నేత‌లు దోచుకుతింటున్నార‌ని.. భూముల ఆక్ర‌మ‌ణ‌లు పెరిగిపోయాయ‌ని వ్యాఖ్యా నించారు. కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత‌లు.. కొంద‌రు సెల‌బ్రిటీల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు.. భ‌య పెట్టి పాల‌న చేసేందుకు రేవంత్ హైడ్రా అస్త్రాన్ని ప్ర‌యోగిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ విష‌యంలోత‌మ‌కు ఎలాంటి భ‌యం లేద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కాగా.. చిలుకూరు బాలాజీ ఆల‌యం ప్ర‌ధాన పూజారి రంగ‌రాజ‌న్‌పై జ‌రిగిన దుండ‌గుల దాడిని కేటీఆర్ ఖండించిన విష‌యం తెలిసిందే. అయితే.. సోమ‌వారం ఆయ‌న‌ను స్వ‌యంగా క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. ఈ నేప‌థ్యంలోనే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. రాజీనామా చేయాలంటూ స‌వాల్ రువ్వారు.

This post was last modified on February 10, 2025 8:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

క్లిస్టర్ క్లియర్!… జగన్ కు ఆ హోదా లేదంతే!

ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని.. ఆలా అయితేనే తాను అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత…

1 hour ago

దళపతి విజయ్ వ్యూహం ?.. పీకేతో జట్టు?

తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి శరవేగంగా దూసుకువస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రిగ కజగం పేరిట రాజకీయ పార్టీని…

2 hours ago

తండేల్ తవ్వి తీసిన పైరసీ చీకటి కోణాలు

ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో జరుగుతున్న చర్చ ఒక్కటే. గేమ్ ఛేంజర్ నుంచి తండేల్ దాకా అసలు హెచ్డి ప్రింట్స్ పైరసీ…

3 hours ago

చంద్ర‌బాబు లౌక్యం!: నామినేటెడ్ పోస్టుల‌కు జీతాలు ఫిక్స్

ఏపీ సీఎం చంద్ర‌బాబు లౌక్యం ప్ర‌ద‌ర్శించారు. కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అనేక నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేశారు. వీటిలో…

4 hours ago

భారత్ రక్షణ శక్తి పెరుగుతోంది… ఏరో ఇండియా 2025లో హైలైట్స్!

ఏషియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పేరుగాంచిన ఏరో ఇండియా 2025 బెంగళూరులో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎయిర్ షోలో భారత…

4 hours ago

ఆర్టీసీ బస్సులో తండేల్ పైరసీ… బన్నీ వాసు రియాక్షన్!

పైరసీ రోజు రోజుకూ ఎంత ప్రమాదకరంగా మారుతోందో ఇటీవలి పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. రిలీజ్ రోజే మంచి క్వాలిటీతో హెచ్‌డీ…

4 hours ago