Political News

‘రాయల్’ ఉదంతంలో నయా ట్విస్ట్… లక్ష్మి అరెస్ట్

జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ చేతిలో మోసపోయానంటూ బయటకు వచ్చిన లక్ష్మి అనూహ్య పరిణామాల మధ్య సోమవారం అరెస్ట్ అయ్యారు. రాజస్థాన్ కు చెందిన జైపూర్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం తిరుపతికి వచ్చి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా లక్ష్మి తరఫు వారు ఎందుకు ఆమెను అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించినా జైపూర్ పోలీసులు సమాధానం ఇవ్వకుండానే లక్ష్మిని తమ వెంట తీసుకెళ్లారు. రాయల్ ఫై ఆరోపణలు చేసిన రెండు రోజుల్లోనే లక్ష్మి ఇలా అరెస్ట్ కావడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.

అసలు లక్ష్మిని జైపూర్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయానికి వస్తే.. గతంలో లక్ష్మి ఫై చెక్ బౌన్స్ కేసు నమోదు అయ్యిందట. జైపూర్ లో నమోదు అయిన ఈ కేసులో ఇప్పటిదాకా చర్యలే తీసుకోలేదు. అయితే… రాయల్ ఫై లక్ష్మి ఆరోపణలు చేసినంతనే… ఈ కేసును బయటకు తీసిన పోలీసులు.. ఇప్పుడే ఈ కేసు నమోదు అయినట్టుగా జైపూర్ నుంచి పోలీసులు తిరుపతి వచ్చి ఆమెను అరెస్ట్ చేసిన తీరు అందరిని ఆశ్యర్యానికి గురి చేసిందని చెప్పాలి. జైపూర్ కి చెందిన ఓ లేడీ పోలీసు అధికారి లక్ష్మి చేయి పట్టుకుని… బలవంతంగానే ఆమెను కారు ఎక్కించారు.

జైపూర్ పోలీసులు తనను అరెస్ట్ చేస్తున్న సందర్బంగా లక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయల్ ఫై తాను ఆరోపణలు చేసినందుకే… తనపై కక్ష కట్టి మరీ అరెస్ట్ చేయిస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. రాయల్ చేయించిన దౌర్జన్యానికి ఇది నిదర్శనమని కూడా లక్ష్మి వ్యాఖ్యానించారు. లక్ష్మి అరెస్ట్ కు సంబంధిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో నమోదు అయినా కేసులో లక్ష్మిని ఇప్పుడు అరెస్ట్ చేసిన తీరుపై అక్కడ ఉన్నవారు ఒకింత షాక్ కు గురయ్యారని చెప్పాలి.

This post was last modified on February 10, 2025 2:56 pm

Share

Recent Posts

వీఐపీల కోసం చేసే హడావిడి ప్రజల కోసం కూడా చెయ్యండి

ముంబైలో పరిశుభ్రత విషయంలో అధికారుల ప్రాధాన్యతలపై బాంబే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రముఖులు నగరానికి వచ్చినప్పుడు రోడ్లను…

16 minutes ago

సీఎం చంద్ర‌బాబుపై కేసులు… హైకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ హ‌యాంలో ప‌లు కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. లిక్క‌ర్ విక్ర‌యాలు స‌హా ఇసుక, గ‌నులు,…

48 minutes ago

సందీప్ వంగ… ఏం క్రేజయ్యా బాబూ

దర్శకుడు అంటే తెర వెనుక ఉండి మొత్తం వ్యవహారాన్ని నడిపించేవాడు. చాలామంది గొప్ప గొప్ప దర్శకులు కూడా చాలా వరకు…

49 minutes ago

రావిపూడిని సైడ్ చేసిన లేడీస్

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమాలను సూపర్ సక్సెస్ చేయడం ఒకెత్తయితే.. ఆ సినిమాలు మొదలైన దగ్గర్నుంచి వాటిని…

2 hours ago

మూడు వారాలకే ఇంటికొస్తే ఎలాగయ్యా

విశ్వక్ సేన్ చాలా ఇష్టపడి కష్టపడి తీసిన సినిమా కల్ట్. టాలీవుడ్ తొలి స్లాషర్ మూవీగా ప్రమోషన్లు కూడా గట్టిగా…

3 hours ago

డ్రాగన్ మనసు మారే అవకాశం ఉందా

2027 ప్యాన్ ఇండియా సినిమాల విడుదల తేదీల రచ్చ చాలా అడ్వాన్స్ గా మొదలైపోయింది. వారణాసి ఏప్రిల్ 7 రాకపోవచ్చనే…

4 hours ago