ప్రధాని, బీజేపీ అగ్రనాయకుడు నరేంద్ర మోడీ.. పట్టుబట్టారంటే.. కమల వికాసం జరగాల్సిందే. దీనికి సహకరించేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా వ్యూహం మరింత చక్కగా కలిసి వస్తుంది. సో.. ఇదే.. మోడీ-షా ధ్వయాన్ని దేశవ్యాప్తంగా అజేయంగా నిలిపింది. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో ఈ ఇద్దరు నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్డీయే కూటమిని కాపాడుకోవడమే కాదు.. కూటమి పార్టీల మధ్య వివాదాలు విభేదాలు రాకుండా.. వ్యవహరించడం కూడా ఈ నేతల సొంతం.
ఏదైనా పొరపాటున ఏ పార్టీ అయినా..దూరమైనా.. మళ్లీ కలుపుకొనేందుకు, ఇచ్చిపుచ్చుకునేందుకు ఎక్కడా సంకోచించరు. రాజకీయాలను రాజకీయాలుగానే చూడడంలో దిట్ట మోడీ-షా ద్వయం. ఇదే.. వారిని ఢిల్లీలో గెలిపించింది. ఈ వ్యూహమే బలమైన సామాన్యుల పార్టీకి.. అసామాన్య పరాజయం మూటగట్టేలా చేసింది. ఊహించని మెజారిటీ సొంతం చేసుకుని కమల వికాసం గుబాళించింది. అయితే.. నెక్ట్స్ ఏంటి? మోడీ-షా వ్యూహంలో తదుపరి ఘట్టం ఏంటి? అని ప్రశ్నించుకుంటే.. అక్క కనిపిస్తోంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ప్రజలు ముద్దుగా పిలుచుకునే దీదీ(అక్క) మమతా బెనర్జీ ని అధికార పీఠం నుంచి దింపేయడమే.. ఇప్పుడు బీజేపీ ముందున్న ప్రధాన ఘట్టం. ఇప్పటికి వరుసగా మూడు సార్లు విజయం దక్కించుకున్న మమతా బెనర్జీ.. నాలుగో సారి ఎన్నికలకు రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది.. ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇది సీట్ల సంఖ్యా పరంగా అదతి పెద్ద రాష్ట్రం. మొత్తం 247 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అధికారం కోసం.. బీజేపీ గత రెండు దఫాలుగా ప్రయత్నిస్తూనే ఉంది.
ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పశ్చిమ బెంగాల్ పై దూకుడు పెంచారు. గత ఎన్నికల్లో మమతను ఆమె నియోజకవర్గంలో ఓడించి కసి తీర్చుకున్నారు. ఇక, అధికారం తృటిలో తప్పిపోయింది. కానీ, ఇప్పుడు మాత్రం పక్కాగా ఇక్కడ విజయం దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టులపై ఉక్కుపాదం మొపుతున్నారన్న చర్చ కూడా ఉంది. పశ్చిమ బెంగాల్‌కు మావోల ప్రభావం ఎక్కువ. ఇక్కడ దీనిని తుద ముట్టించారు.
ఇక, అభివృద్ధిలోనూ ముందుకు తీసుకువెళ్తున్నారు. కేంద్ర ప్రాజెక్టులు జోరుగా చేపడుతున్నారు. బంగ్లా దేశ్ నుంచి వచ్చే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపి.. సరిహద్దుల్లో ఉత్తర పరగణాల జిల్లాల్లో బీజేపీ జెండా ఎగరేస్తున్నారు. ఈ పరిణామాలుమున్ముందు మరింత పెరగనున్నాయి. ఎలా చూసుకున్నా.. దీదీని ఓడిస్తే.. మోడీకి భారీ సెగ తప్పుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.
This post was last modified on February 10, 2025 1:43 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…