Political News

రాయల్ ఫై జనసేన విచారణ… కీలక ఆదేశాలు జారీ

ఓ మహిళతో వివాహేతర బంధం ఆమెతో ఆర్థికపరమైన సంబంధాలు.. వాటికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు… వెరసి జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ ఫై ఓ పెద్ద రచ్చ సాగుతున్న సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఇదే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే రాయల్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగానే స్పందించారు. . తనకు సంబంధించిన వీడియోలు ఎవరు విడుదల చేస్తున్నారో కనుక్కోవాలని… వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై జనసేన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విచారణ పూర్తీ ఆయ్యేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ రాయల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ తరఫున ఆదివారం ఓ కీలక ప్రకటన జారీ అయ్యింది. ఈ ప్రకటనలో కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసింది. విచారణను నిస్పక్షపాతంగా చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ మాటతో రాయల్ ఫై విధించిన ఈ నిషేదాజ్ఞలు తాత్కాలికమేనని పార్టీ చెప్పినట్టు అయ్యింది. విచారణ పూర్తి కాగానే రాయల్ యధావిధిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

రాయల్ ఫై రేగిన ఈ వివాదం నేపథ్యంలో.. పార్టీ శ్రేణులకు అధిష్టానం కీలక సూచనలు చేసింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై మాత్రమే దృష్ఠి సారించాలని … ఇతరత్రా విషయాలను ఏమాత్రం పట్టించుకోరాదని సూచించింది. సమాజానికి ఉపయోగపడని వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టేయాలని కూడా సూచించింది. అటు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని.. ఇటు పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉంచాలని కూడా స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించినట్టు ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.

This post was last modified on February 10, 2025 9:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

“జగన్ ఇప్పటివరకు లీవ్ లెటర్ ఇవ్వలేదు” : RRR

అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, కాబట్టి సమావేశాలకు తాను హాజరు కావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ పదే…

2 hours ago

బొత్స వ‌ర్సెస్ గుడివాడ‌.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం ..!

వైసీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు జ‌రుగుతున్నాయి. పైకి అంద‌రూ బాగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నా.. అంతర్గ‌తంగా మాత్రం పై ఎత్తులు వేసుకుంటు.. నాయ‌కులు…

4 hours ago

చంద్రయాన్-3 ద్వారా బయటపడిన కొత్త రహస్యాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ చేయడంతో కొత్త ఆవిష్కరణలు…

4 hours ago

సాయిరెడ్డి `ప్లేస్` కోసం.. ఆ ఎంపీ ప్ర‌య‌త్నాలు.. !

వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజ్యస‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి.. ఆ రెండు ప‌ద‌వులు వ‌దులుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. సాయిరెడ్డి…

7 hours ago

ద‌మ్ముంటే రాజీనామా చెయ్‌: రేవంత్‌కు కేటీఆర్ స‌వాల్‌

బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆయ‌న…

9 hours ago

క్లిస్టర్ క్లియర్!… జగన్ కు ఆ హోదా లేదంతే!

ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని.. ఆలా అయితేనే తాను అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత…

10 hours ago