కేకే సర్వే… మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో జనం నోళ్ళలో బాగా నానిన పేరిది. అటు లోక్ సభ ఫలితాలతో పాటుగా ఇటు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను పక్కాగా అంచనా వేయడంలో ఈ సంస్థ సత్తా చాటింది. కేకే సర్వే చెప్పినట్టుగానే ఏపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. సీట్లతో పాటుగా ఏ ఏ జిల్లాల్లో ఎన్నెన్ని సీట్లు.. ఏ ఏ పార్టీలకు వస్తాయన్న విషయాన్నీ కూడా ఈ సంస్థ ముందే చెప్పేసింది. కేకే సర్వే చెప్పినట్టుగానే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సంస్థ చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చాలా మంది నమ్మలేదు. ఇదేదో టీడీపీ, జనసేనలకు అనుకూలంగా పని చేస్తున్న సంస్థ అంటూ దీనిపై చాలా మంది ఓ ముద్ర వేశారు. 151 సెట్లు ఉన్న వైసీపీకి 10-15 సీట్లు ఏమిటంటూ అంతా పెదవి విరిచారు. కేకే సంస్థ ఎగ్జిట్ పోల్స్ శుద్ధ అబద్దమని కూడా నమ్మారు. అయితే… ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కేకే సంస్థ పేరు తలచుకొని వారు లేరంటే అతిశయోక్తి కాదు.
అలంటి మంచి పేరున్న కేకే సంస్థ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తేలిపోయాయి. కేకే సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో అధికార ఆప్ 44 సీట్లు దక్కించుకుని తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని చెప్పింది. అదే సమయంలో విపక్ష బీజేపీ.. కేవలం 26 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పింది. అయితే… నేడు విడుదల అయినా ఫలితాలు కేకే సర్వే అంచనాలు తప్పని తేల్చాయి. అధికార ఆప్ 23 సీట్లకు పరిమితం కాగా… బీజేపీ రికార్డు విక్టరీ కొట్టి ఏకంగా 47 సీట్లు దక్కించుకుంది. ఈ రెండు పార్టీల విషయంలో కేకే సర్వే అంచనా తప్పినా.. కాంగ్రెస్ కు సింగల్ సీటు కూడా రాదని కేకే సర్వే చెప్పిన మాట మాత్రం నిజమేనని తేలింది.
This post was last modified on February 8, 2025 4:29 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…