ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ దూసుకుపోయింది. 45 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరించింది. దీంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు ఉడిగిపోయాయి. మూడోసారి కూడా.. అధికారం తమదేనని భావించిన.. కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రజలు దూరమయ్యారు. అసలు ఆయన గెలుపే అటు-ఇటుగా ఉండడం మరోదారుణం. ఇక, కీలక నేతలు కూడా వెనుకంజలో ఉన్నారు.
ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా అనేక విశ్లేషణలు వస్తున్నాయి. చిత్రం ఏంటంటే.. బీజేపీ గెలిచినందుకం టే కూడా.. ఆమ్ ఆద్మీ ఓటమిపైనే ఎక్కువగా చర్చలు, విశ్లేషణలు వస్తుండడం గమనార్హం. ఢిల్లీ ప్రజల నాడిని అంచనా వేసినా.. ఫలితం ఇలా ఉంటుందని ఊహించలేదని పలువురు ప్రముఖులు పేర్కొన్నా రు. ఇక, ఈ క్రమంలో ప్రముఖ హేతువాది, ఉద్యమ నాయకుడు..కేజ్రీవాల్ సుదీర్ఘ అనుబంధం ఉన్న అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారని దుయ్యబట్టారు. ఆయన అవినీతి, అక్రమాల్లో కేజ్రీవాల్ నిండా మునిగిపోయారని వ్యాఖ్యానించారు. గతంలోనే తాను అనేక సందర్భాల్లో అవినీతి, అక్రమాలపై హెచ్చరించానని, అయినా తన మాటలను ఆప్ పట్టించుకోలేదని.. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేజ్రీవాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అద్దాల బంగళా వద్దని చెప్పా. సామాన్యుడిగా రాజకీయ ప్రస్తానం ప్రారంభించావు. అలానే ఉండు అని చెప్పా. వినలేదు. ఇప్పుడు అనుభవించాలి. తప్పదు
అని అన్నా అన్నారు.
మరీ ముఖ్యంగా లిక్కర్ వద్దంటూ ఉద్యమం చేసి.. లోక్‌పాల్ కోసం నిరసనలు చేసిన తన శిష్యుడు.. అదే జవాబుదారీ తనాన్నిపక్కన పెట్టారని విమర్శించారు. లిక్కర్ కుంభకోణంలో నిలువునా మునిగిపోయి.. జైలుకు వెళ్లినా.. ఆత్మ పరిశీలన చేసుకోలేదన్నారు. అందుకే కేజ్రీవాల్‌ను ప్రజలు ఓడించారని అన్నా హజారే పేర్కొన్నారు. పార్టీ పెట్టడం గొప్ప విషయం కాదు. రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు.. చేయాల్సిన పనిచేయకపోతే.. ఫలితం ఇలానే ఉంటుంది
అని వ్యాఖ్యానించారు.
This post was last modified on February 8, 2025 1:51 pm
అరవింద్ కేజ్రీవాల్... దేశ రాజకీయాల్లో రీసౌండ్ ఇచ్చిన పేరిది. ఇటు అధికార బీజేపీతో పాటుగా అటూ నాడు అధికారంలో ఉన్న…
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్…
రెండేళ్ల కిందట తమిళంలో లవ్ టుడే అనే చిన్న సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింద తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్…
దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. 699 మంది అభ్యర్తులు..…
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఒక సుగుణం ఉంటుంది. ఆయన్ను కలవటం.. టైం…
ఎన్నాళ్ళో వేచిన ఉదయం అనే పాట ఇప్పుడు నాగచైతన్యకు బాగా సరిపోతుంది. ఎందుకంటే గత కొన్ని సినిమాలు కనీస టాక్…