ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి రానున్న ఈ పథకం కింద… గుండె పోటు వచ్చిన పేదలకు చికిత్స అందేవరకు వారి ప్రాణాలను నిలబెట్టేలా సర్కారు చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా… గుండెపోటు వచ్చిన తోలి గంటలో రోగికి ఇవ్వాల్సిన టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ ను ఉచితంగా ఇవ్వనుంది. ఈ ఇంజక్షన్ ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు ఉంటుంది. ఇంత ఖరీదు చేసే ఇంజక్షన్ ను కూడా పేదలకు ఉచితంగానే ఇవ్వాలని చంద్రబాబు సర్కారు తీర్మానించింది.
ఇటీవలి కాలంలో గుండెపోటు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ రోగాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఓ స్థాయి ఆర్ధిక స్తొమత ఉన్న వారు అయితే ఫరవా లేదు గానీ.. పేదలకు గుండె పోటు వస్తే ప్రాణాంతకమే. సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలంటే…సమయం పడుతుంది. ఈ లోగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గుండెపోటు వస్తే సకాలంలో చికిత్స అందితే… పెద్దగా ముప్పేమీ ఉండదు. అయితే ఆ చికిత్స సకాలంలో అందడమన్నది అన్ని ప్రాంతాలకు సాధ్యం అయ్యే పని కూడా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ అత్యంత కీలకమని చెప్పాలి. ప్రభుత్వం ఈ ఇంజక్షన్ ను ఉచితంగానే అందిస్తే… పేదల ప్రాణాలకు భరోసా దక్కినట్టే.
సాధారణంగా గుండెపోటు వస్తే… క్షణాల్లో డబ్బు సమకూర్చుకోవడం చాలా కష్టమే. ఓ వైపు ఆర్ధిక స్తొమత, మరోవైపు ఆసుపత్రుల దూరాభారం పేదలకు ప్రాణాంతకంగా మారింది. ఈ పరిస్థితులపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గుండె పోటు వచ్చినా కూడా పేదలు భయపడకూడదన్న భావనతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. చంద్రబాబు సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పేదల ఆరోగ్య పరిరక్షణలో ఓ కీలక మైలు రాయిగా పరిగణించవచ్చు. గుండెపోటు మరణాలు కూడా ఈ నిర్ణయం వల్ల భారీగా తగ్గుతాయని చెప్పాలి.
This post was last modified on February 7, 2025 6:27 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…