మంత్రి నారా లోకేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ముఖ్యమంత్రి.. ఏపీ విధ్వంసకారి అంటూ వైసీపీ అధినేత జగన్ పై ఆయన నిప్పులు చెరిగారు. అంతేకాదు.. తప్పులు చేసి.. తప్పించుకునే ప్రయత్నం చేశారని.. వైసీపీ మంత్రులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆయన(జగన్) లాగా మేం తప్పులు చేసి తప్పించుకునే ప్రయత్నం చేయం. మేం ఏదైనా తప్పులు చేస్తే.. వాటిని గౌరవంగా అంగీకరిస్తాం. తప్పులు సరిదిద్దుకునేందుకు మాకు మేం ప్రయత్నం చేస్తాం. ఎవరైనా వచ్చి మీరు తప్పు చేస్తున్నారు.. అని చెప్పినా కేసులు పెట్టం. పెట్టించం. వారు చెప్పే తప్పులను లెక్కలు వేసుకుంటాం. సరిచేసుకుంటాం.” అని వ్యాఖ్యానించారు.
అంతిమంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబు దారీగా ఉంటుందని నారా లోకేష్ చెప్పారు. కూటమిలో ప్రతి ఒక్కరూ ప్రజలకు బాధ్యులేనన్న ఆయన.. ఎవరూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదన్నారు. అందరూ కలసి కట్టుగా మాట్లాడుకుని విధానపరమైన నిర్ణయాలపై ఒక విధానం పాటిస్తామని చెప్పారు. “గతంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఒకే ఒక్క విధ్వంసకారుడు తీసుకున్న నిర్ణయంతో అమరావతి ఆగిపోయింది. పెట్టుబడి దారులు పరారయ్యారు. ఉద్యోగాలు రాలేదు. ఉపాధి లేదు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో కూడా తెలియదు. అంతా అరాచకం. మేం రాజకీయాల కోసం ఈ మాట అనడం లేదు. కేంద్రం కూడా ఇదే చెప్పింది. కాగ్ కూడా గణాంకాలతో సయితంగా వివరించింది” అని లోకేష్ చెప్పుకొచ్చారు.
తాజాగా సోమవారం సాయంత్రం రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు.. మంత్రి నారా లోకేష్‌ను కలుసుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను వారు విన్నవించారు. ఈ సందర్భంగా లోకేష్ వారితో మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే.. పాలన పట్టాలెక్కుతోందన్నారు. రాష్ట్రంపై పెట్టుబడి దారులకు నమ్మకం కలుగుతోందని తెలిపారు. విదేశీ విద్యార్థులు కూడా ఒకప్పుడు ఏపీని వెతుక్కుని వచ్చారని.. కానీ, గత ఐదేళ్ల విధ్వంస పాలన చూసిన తర్వాత పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారని చెప్పారు. తప్పులు చేసి.. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని.. వాటిని చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నిలబెడుతోందన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు ప్రకటన చేస్తారని నారా లోకేష్ చెప్పారు. అన్ని విషయాలను కూటమిలోని ప్రతి ఒక్కరూ చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తారని తెలిపారు. తాను ఒక్కడినే ఒక నిర్ణయం తీసుకుని.. తర్వాత.. వేరే వారు మరో నిర్ణయం ప్రకటించే సంస్కృతి.. నిరంకుశ విధానం కూటమి ప్రభుత్వంలో ఉండబోవని ఆయన వెల్లడించారు. ఈ విషయంపైనైనా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు అందరూ సమష్టిగా నిర్ణయం తీసుకున్నాకే.. వెల్లడిస్తామని.. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున ఈ విషయంపై ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం తగదని వారికి చెప్పారు.
This post was last modified on February 4, 2025 10:04 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…