1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో తొలి సారి ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు… సుపరిపాలనకు శ్రీకారం చుట్టారు. అసలు అప్పటిదాకా సుపరిపాలన అంటే ఏమిటో తెలియదు. అసలు ఆ పదమే మెజారిటీ ప్రజలకు తెలియదు. ఉన్నత విద్యావంతులకు ఈ, పదం తెలిసినా… పెద్దగా అవగాహన అయితే లేదు. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటుగా కేంద్రం కూడా సుపరిపాలన బాటలోనే పయనిస్తున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా టీడీపీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేతల అభ్యర్థనతో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోకి దిగిన చంద్రబాబు… బీజేపీ అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్… చంద్రబాబు వెంటే సాగుతున్నారు. ఢిల్లీ చంద్రబాబు ప్రచారం ఏర్పాట్ల బాధ్యతలను భుజానికెత్తుకున్న ఖట్టర్… అనుక్షణం చంద్రబాబు వెంటే నడుస్తున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని ఖట్టర్ గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టక ముందు ఖట్టర్ హర్యానాకు ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా బీజేపీ అనుబంధ సంఘాల్లో పనిచేసిన ఖట్టర్…2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి… వచ్చీ రావడంతోనే హర్యానా సీఎం పదవిని దక్కించుకున్నారు. ఈ లెక్కన ఖట్టర్ కు పాలిటిక్స్ పై మంచి పట్టే ఉన్నా… పాలనపై అంతగా పట్టు లేదనే చెప్పాలి. ఆ సమయంలో విభజిత ఏపీకి సీఎంగా చంద్రబాబు ఉన్నారు. పాలనలో తర్వాతి తరం సంస్కరణలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు దూసుకుపోతున్నారు.
పాలనపై అవగాహన పెంచుకునే మార్గాలను వెతికిన ఖట్టర్… చంద్రబాబు సుపరిపాలనను గురించి తెలుసుకుని ఇంప్రెస్ అయ్యారు. వెంటనే తన ప్రతినిధి బృందాన్ని ఏపీకి పంపించి… చంద్రబాబు అందిస్తున్న సుపరిపాలనపై అధ్యయనం చేయించారు. ఆ తర్వాత అవే సంస్కరణలను అమలు చేస్తూ… ఖట్టర్ కూడా చంద్రబాబు మాదిరే హర్యానాలో సుపరిపాలనను అందించారు. ఫలితంగా బీజేపీలో తిరుగులేని నేతగా ఎదిగారు. కేంద్ర మంత్రిగా ప్రమోట్ అయ్యారు. శనివారం చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టినంతనే ఈ విషయాలన్నీ గుర్తు చేసుెకున్న ఖట్టర్… వాటన్నింటినీ ఇంటరెస్టింగ్ గా వివరిస్తూ సాగారు.
This post was last modified on February 3, 2025 11:35 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…