వైసీపీ కీలక నేత, ఏపీ శాసనమండలిలో విపక్ష నేతగా సాగుతున్న బొత్స సత్యనారాయణ సెలవు దినం అయిన ఆదివారం అధికార కూటమి సర్కారుకు పెను సవాలే విసిరారు. మేం తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోండి బాసూ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. శనివారం పార్లమెంటు ముందుకు వచ్చిన కేంద్ర బడ్జెట్ పై స్పందించేందుకు ఆదివారం బొత్స మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
కేంద్ర బడ్జెట్ లో మరోమారు ఏపీకి అన్యాయం జరిగిందని బొత్స ఓ రూలింగ్ ఇచ్చేశారు. అదే సమయంలో మరోమారు బీహార్ కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించిందని కూడా ఆయన ఆరోపించారు. టీడీపీ తరఫున 16 మంది ఎంపీలున్నా… ఏపీకి అన్యాయం జరిగిందని ఆయన ఆవేన వ్యక్తం చేశారు. టీడీపీతో పాటు జనసేన, బీజేపీలకు కూడా ఏపీలో ఎంపీలున్న విషయాన్ని ప్రస్తావించిన బొత్స… ఏపీకి అన్యాయం జరుగుతూ ఉంటే… అందరూ చోద్యం చూశారని మండిపడ్డారు. ఇది రాష్ట్రాభివృద్ధికి మంచి పద్ధతి కాదని కూడా బొత్స వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత వైసీపీ సర్కారులో పెద్ద ఎత్తున తప్పులు జరిగాయంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై బొత్స స్పందించారు. ఈ సందర్భంగా తాను నిర్వహించిన విద్యా శాఖలో అక్రమాలు జరిగాయంటూ సాగుతున్న అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. వైసీపీ హయాంలో తప్పులు జరిగి ఉంటే.. విచారణ చేసి చర్యలు తీసుకోండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన విద్యా శాఖలో నాడు-నేడులో తప్పులు జరిగాయంటే తనపైనా చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. డిజిటలైజేషన్ లో అక్రమాలు జరిగినా చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వం వహిస్తున్న విద్యా శాఖలో అక్రమాలు, చర్యలపై బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలకు తెర లేపింది.
This post was last modified on February 2, 2025 3:29 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…