మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా 8 సార్లు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డులకు ఎక్కారు. ఇప్పటిదాకా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల… తాజాగా శనివారం 8వ సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డులకు ఎక్కారు.వాస్తవానికి గతేడాదే నిర్మల ఈ రికార్డును చేరుకున్నారు గానీ.. ఎన్నికల తర్వాత ఆమె ప్రవేశపెట్టింది మధ్యంతర బడ్జెట్టే కదా. అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే… శనివారం నాటి బడ్జెట్ ఆమెను రికార్డులకు ఎక్కించింది. తమిళనాడుకు చెందిన నిర్మల… ఏపీకి చెందిన పరకాల ప్రభాకర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
గతంలో 10 బడ్జెట్ లు ప్రవేశపెట్టిన నేతలు కూడా ఉన్నా…వరుసబెట్టి ఇన్నేసి బడ్జెట్ లు ప్రవేశపెట్టిన విషయంలో మాత్రం నిర్మలదే తొలి స్థానం. గతంలో మొరార్జీ దేశాయ్ ఏకంగా 10 బడ్జెట్ లను ప్రవేశపెట్టారు. అయితే అవన్నీ ఆయన వరుసగా ప్రవేశపెట్టినవి కావు. 6 బడ్జెట్ లను వరుసగా ప్రవేశపెట్టిన దేశాయ్..మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని మిగిలిన 4 బడ్జెట్ లను .ప్రవేశపెట్టారు. ఇక నిర్మల పుట్టినిల్లు తమిళనాడుకు చెందిన పి.చిదంబరం 9 బడ్జెట్ లను ప్రవేశపెట్టినా… ఆయన కూడా మధ్యలో గ్యాప్ తీసుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా 8 బడ్జెట్ లను ప్రవేశపెట్టినా… ఆయనకూ కొంత గ్యాప్ వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 5 బడ్జెట్ లను వరుసబెట్టి ప్రవేశపెట్టారు.
నిర్మలమ్మను ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలోనే తన కేబినెట్ లోకి తీసుకున్నా… 2014లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పదవి ఇచ్చారు. ఆ తర్వాత వాణిజ్య శాఖ మంత్రిగా అదే ఏడాదిలో ప్రమోషన్ దక్కించుకున్న నిర్మల… 2017లో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా టాప్ పొజిషన్ లోకి వచ్చారు. ఇక 2019లో మోదీ వరుసగా రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మల… మోదీ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఫలితంగానే వరుసగా మోదీ మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా నిర్మలకే ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు దక్కాయి. మరో రెండు బడ్జెట్ లు ప్రవేశపెడితే… దేశంలో అత్యధిక సంఖ్యలో బడ్జెట్ లను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటారు.
This post was last modified on February 1, 2025 11:22 am
రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ…
నిన్న షాహిద్ కపూర్ దేవా చెప్పుకోదగ్గ అంచనాల మధ్య రిలీజయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ కావడంతో అంతోఇంతో మనోళ్ల దృష్టి…
నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల్లో అంతగా సౌండ్ చేయకుండా కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న సినిమా కుబేర. ధనుష్, నాగార్జున…
జనంపల్లి అనిరుధ్ రెడ్డి… ఈ పేరు గడచిన రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.…
వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ కొడతాడని సంక్రాంతికి వస్తున్నాంలో ఉపేంద్ర లిమయే చెప్పిన డైలాగ్…
ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన గజిని మూవీ లవర్స్ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్. సూర్య కెరీర్ ని…