యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్దిపై నమోదైన అక్రమాస్తుల కేసులన్నింటిలో సాయిరెడ్డి రెండో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జగన్ తో పాటే అరెస్టై…జగన్ మాదిరే బెయిల్ తీసుకుని సాయిరెడ్డి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఇంకా బెయిల్ పైనే ఉన్నారు. ఈ లెక్కన దేశం వదిలి వెళ్లాలంటే కోర్టుల అనుమతి తప్పని సరి కదా. మొన్న లండన్ వెళ్లిన జగన్ కూడా సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఫ్రాన్స్, నార్వేలలో నెల రోజుల పర్యటనకు వెళుతున్నానని…అందుకు అనుమతించాలంటూ గత వారమే సాయిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణను పూర్తి చేసిన కోర్టు.. శుక్రవారం తన తీర్పును వెలువరించింది. సాయిరెడ్డి ఫారిన్ టూర్ కు ఓకే చెప్పిన కోర్టు.. సాయిరెడ్డి కోరినట్లుగా నెల రోజుల టూర్ కు మాత్రం అంగీకరించలేదు. 15 రోజుల పాటు పర్యటనకు మాత్రమే అనుమతించింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 మధ్యలో ఈ 15 రోజుల టూర్ ను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
అయినా ఫారిన్ టూర్ కు అనుమతిస్తూనే… నిందితుడు కోరినట్లుగా కాకుండా… టూర్ నిడివిని కోర్టు నిర్ణయించడం సాయిరెడ్డి విషయంలోనే జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. టూర్ కు కోర్టు అనుమతించకున్నా ఫరవా లేదన్న వాదనలు వినిపస్తున్నాయి. అలా కాకుండా టూర్ కు అంగీకరిస్తూనే…మీ ఇష్టం వచ్చినట్లుగా నెల అంటే కుదరదు… 15 రోజుల్లో టూర్ ను పూర్తి చేసుకుని రమ్మంటూ కోర్టు చెప్పడం నిజంగానే సాయిరెడ్డికి భారీ షాకేనని చెప్పక తప్పదు. ఈ తరహాలో కోర్టులు చాలా అరుదుగా చెబుతుంటాయి. అది ఇప్పుడు తన విషయంలో జరగడంతో సాయిరెడ్డి అసలు టూర్ కు వెళ్లాలా? వద్దా?అన్న డైలమాలో పడిపోయారు.
This post was last modified on January 31, 2025 10:45 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…