ఏపీలోని కూటమి సర్కారును నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు శుక్రవారం బిగ్ రిలీఫ్ లభించింది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఒక్కరోజే 1200 కోట్ల రూపాయలు సమకూరాయి. అయితే.. ఇదేదో అప్పుగానో.. లేక గ్రాంటుగా కేంద్రం నుంచో వచ్చిన సొమ్ములు కావు. రాష్ట్ర ప్రజలు కట్టిన సొమ్ములు. ఔను.. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే భూములు, పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు కట్టిన సొమ్ము. అది కూడా సాయంత్రం 5 గంటల వరకు సర్కారుకు జమ అయిన సొమ్ములని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. శనివారం(ఫిబ్రవరి 1) నుంచి రాష్ట్రంలో భూముల ధరలు పెరుగుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా పెంచుతున్నారు.
ఈ విషయం గత నాలుగు రోజులుగా మీడియా ప్రధానంగా వెలుగులోకితెచ్చింది. మంత్రులు కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యం లో రిజిస్ట్రేషన్ ధరలు, భూముల ధరలు పెరిగితే.. మరింత భారం అవుతుందని అనుకున్న మధ్యతరగతి, ఉన్నత వర్గాల ప్రజలు శుక్రవారం కొత్త కొనుగోళ్లకు తెరదీశారు. ‘ముందు.. రిజిస్ట్రేషన్ చేసేయ్!’ అంటూ స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తారు. వీటిలో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు(కొత్తగా చేరింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో), రాజమండ్రి, ఏలూరు, కాకినాడ వంటి ప్రధాన నగారాల్లో సాయంత్రం ఐదు గంటలు దాటాక కూడా.. రిజిస్ట్రార్ కార్యాలయాలు కిక్కిరిసే ఉన్నాయి.
మాఘమాసం, అందునా శుక్రవారం మంచి రోజు కావడం, తెల్లవారితో ధరలు పెరుగుతుండడంతో భూములు కొనేవారు, అపార్ట్‌మెంటు ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు వరుస పెట్టి క్యూ కట్టారు. దీంతో రెవెన్యూ శాఖకు సాయంత్రం 5 గంటల వరకు జమ అయిన.. సొమ్ము 12325 కోట్ల రూపాయలకు పైగానే అందినట్టు అధికారులు తెలిపారు. అయితే.. మరింత మంది వెయిటింగులో ఉన్నారని.. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చార్జీలను అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో మరో రెండు మూడు వందల కోట్ల రూపాయలు పెరుగుతాయని అంచనా వేశారు.
ఇలా ఒకే రోజు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం ఇటీవలకాలంలో ఇదే మొదటి సారి. దీంతో ప్రస్తుతం సర్కారుకు ఆర్థిక ఊపిరి అందినట్టు అయింది. పైగా ఈ సొమ్ము అచ్చంగా సర్కారుకే చెందడంతో పాటు.. ఎవరికీ ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకపోవడంతో మరింత వెసులుబాటు దక్కినట్టు అయిందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే..చంద్రబాబు విజన్ 2047, అభివృద్ధి నేపథ్యంలో భూములు కొనుగోలుచేసేవారు పెరిగారు. అదేవిధంగా అపార్ట్‌మెంట్లు నిర్మాణంలో ఉండగానే వాటికి సైతం రెక్కలు రావడం గమనార్హం.
This post was last modified on January 31, 2025 7:14 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…