తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కిపోయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే… శుక్రవారం బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు… కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఎప్పుడైతే సంచలన వ్యాఖ్యలు చేశారో… ఆ మరుక్షణమే తెలంగాణలో ఒక్కసారిగా హీట్ తారాస్థాయికి చేరింది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నుంచి నేతలు క్యూ కట్టారు.
కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత షాద్ నగర్ లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి… కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను చెల్లని వెయ్యి రూపాయల నోటుతో పోల్చిన రేవంత్… చెల్లని నోటుతో స్నేహం జైలు పాలు చేస్తుందని సెటైర్లు సంధించారు. కేసీఆర్ తో జనానికి బంధాలు తెగిపోయాయని కూడా ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలను బలంగా కొడతానన్న కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావించిన రేవంత్… కొట్టుడు కాదు కనీసం కేసీఆర్ చక్కగా నిలబడగలరా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త్వరలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నామన్న రేవంత్… దమ్ముంటే ఆ సమావేశాలకు కేసీఆర్ రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రస్ పై కేసీఆర్ చేసిన సెటైర్లను వరుసబెట్టి గుర్తు చేసిన రేవంత్.. వాటన్నింటికీ అదిరిపోయే కౌంటర్లు ఇచ్చారు.
రేవంత్ కంటే ముందే కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి.. ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఢిల్లీలో మాదిరే కేరళలోనూ కవిత లిక్కర్ స్కాంకు పాల్పడ్డారని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మాటలు చెప్పుడు కాదు దమ్ముంటే… కేసీఆర్ బయటకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఇక రేవంత్ స్పందన తర్వాత మీడియా ముందుకు వచ్చిన జగ్గారెడ్డి… కేసీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ చేతుల్లోనే బలం ఉండదన్న జగ్గారెడ్డి… ఆయన బలమంతా నోటిలోనే ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు ఊదే గాలిలో కేసీఆర్ కొట్టుకుని పోతారని కూడా జగ్గారెడ్డి వ్యంగ్యాస్త్రాన్నిసంధించారు. మొత్తంగా అటువైపు నుంచి కేసీఆర్ ఒక్కరు వస్తే… ఇటు వైపు కాంగ్రెస్ నుంచి నేతలు క్యూ కట్టడం గమనార్హం.
This post was last modified on January 31, 2025 7:04 pm
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…