బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాన్నాళ్ల తర్వాత తన గళాన్ని విప్పారు. 2023 ఆకరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా.. తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనకు తెర పడిపోయింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి చేరగా.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టింది. అయితే ఎందుకనో గానీ… కేసీఆర్ చాలాకాలంగా బయటకే రావడం లేదు. ఎర్రవలిలోని తన ఫామ్ హౌజ్ లోనే ఉంటున్న కేసీఆర్…ఏది ఉన్నానేతలను అక్కడికే పిలిపించుకుని మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నేతృత్వంలో పలువురు పార్టీ ప్రముఖులు కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రవలికి వెళ్లారు. వీరితో పాటు వారి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలోనే ఎర్రవలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అందరినీ చూసి సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్.. వారితో ముచ్చటించేందుకు వచ్చారు. హరీశ్ సహా అక్కడికి వచ్చిన మిగిలిన నేతలతో పలు అంశాలపై మాట్లాడిన కేసీఆర్… ఆ తర్వాత అందరినీ ఉద్దేశించి మైకులో ప్రసంగించారు.
ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత కేసీఆర్ వాయిస్ ఒకింత గట్టిగానే వినిపించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనా తీరుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. గతంలో తెలంగాణ కోసం పోరాటం సాగించామని గుర్తు చేసిన కేసీఆర్… ఇప్పుడు ప్రజలకు న్యాయం చేసేందుకు మరోమారు పోరాటం చేయాల్సిందేనని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు. కరోనా సమయంలో కూడా తాను రైతు బంధును ఆపలేదన్నారు. రైతు బంధుతో లక్షలాది మంది రైతులకు మేలు జరిగిందన్నారు కాంగ్రెస్ పాటనలో రైతు బందుకు రాంరాం పలికారని సెటైర్లు వేశారు..
రాష్ట్రంలో మళ్లీ కరెంటు కోతలు, నీటి కష్టాలు మొదలయ్యాయని కేసీఆర్ ఆరోపించారు. నమ్మి ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని విమర్శించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలను వాడుకుందని ఆరోపించారు. గురుకులాల్లో అన్నీ సమస్యలే రాజ్యమేలుతున్నాయన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ ముంచిందన్నారు. సంగేశ్వర,బసవేశ్వర ప్రాజెక్టుకు టెండర్లు ఎందుకు పిలవరని ప్రశ్నించారు. ఇక లాభం లేదన్న కేసీఆర్… మళ్లీ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాల్సిందేనని పిలుపునిచ్చారు. హరీశ్ రావు ఆధ్వర్యంలో నిరసనలకు తెర తీయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.
This post was last modified on January 31, 2025 3:44 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…