తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొత్త రచ్చ మొదలైంది. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే నిలుచుంటే…మరోవైపు మాజీ ఎమ్మెల్యే నిలుచుని బస్తీ మే సవాల్ అనే రీతిలో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వీరిలో ఒకరు మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ సీనియర్ నేత, మీడియా సంస్థ అధినేత గడ్డం వివేక్ వెంటకస్వామి ఒకరు కాగా… పార్టీలో మంచి మైలేజీ ఉన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మరొకరు.
ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ నేతలే. ఇద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే వివేక్ ఎస్సీలోని మాల వర్గానికి చెందిన వారు కాగా… సంపత్ అదే ఎస్సీలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ సారూప్యతలే వీరి మధ్య కొత్త చిచ్చును రాజేసింది.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఎస్సీ వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు కూడా అనుకూలమే. అయితే ఒక్క మాల సామాజిక వర్గం మాత్రమే వర్గీకరణను వ్యతిరేకిస్తోంది.
ఈ క్రమంలో మాల సామాజిక వర్గానికి చెందిన వారిని ఏకం చేసేలా వివేక్ మొన్న ఓ సభ నిర్వహించారు. ఈ సభపై సంపత్ ఒక్కసారిగా భగ్గుమన్నారు. వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలమేనన్న సంపత్.. మాలలతో సభ పెట్టి వివేక్ పార్టీ లైన్ దాటారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ అదిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. సంపత్ ఫిర్యాదుపై భగ్గుమన్న వివేక్…తాను నిర్వహించిన సభలో మాదిగలకు గానీ, వర్గీకరణకు గానీ తాను వ్యతిరేకంగా మాట్లాడలేన్నారు.
అయినా తాను ఒక్క సభ పెట్టుకుంటూనే ఇంత రాద్దాంతం చేయాలా? అని వివేక్ ఫైర్ అయ్యారు. అయినా తాను పార్టీ లైన్ ను ఎప్పుడూ దాటనని, ఈ విషయంలో పార్టీ తనపై ఏ రకమైన చర్యలు తీసుకున్నా తాను సిద్ధమేనని ప్రకటించారు. మొత్తంగా ఈ ఇద్దరు ఎస్సీ నేతల మధ్య నెలకొన్న వివాదం పార్టీ అధిష్ఠానానికి కూడా పెను సమస్యగానే పరిణమించిందని చెప్పక తప్పదు.
This post was last modified on January 31, 2025 2:20 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…