మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయిన వైసీపీలో కొనసాగేందుకు ఆ పార్టీకి చెందిన మెజారిటీ నేతలు హడలిపోతున్నారు. ఇప్పటికే వైసీపీకే కాకుండా ఏకంగా వైఎస్ ఫ్యామిలీకి నమ్మిన బంటులుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సామినేని ఉదయభానులు వరుసబెట్టి ఎగ్జిట్ ఇచ్చేశారు. ఇక పార్టీలో జగన్ తర్వాత స్థానంలో ఉన్ననేతగా చెప్పుకున్న విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయ సన్యాసమే తీసుకుని… నేరుగా సాగులోకి దిగిపోయారు.
ఈ లెక్కన ఇంకా చాలా మంది నేతలు వైసీపీని వీడటం ఖాయమేనన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమేనన్నట్లుగా వరుస పరిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వార్తల్లో తన పేరు కూడా వచ్చిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెగ ఇదైపోయారు. 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి గెలిచిన సురేశ్… 2024 ఎన్నికల్లో కనీసం ఆ టికెట్ ను కూడా నిలుపుకోలేకపోయారు. తాటిపర్తి చంద్రశేఖర్ రావడంతో జగన్ ఆయనను సింగరాయకొండకు బదిలీ చేసి పారేశారు. ఈ బదిలీ సురేశ్ కు కలిసిరాకపోగా… ఓటమి పాలయ్యారు. అదే తన సీటులో నిలబడ్డ చంద్రశేఖర్ మాత్రం గెలిచారు.
పూర్వాశ్రమంలో ఇండియన్ సివిల్ సర్వెంట్ గా సేవలు అందించిన సురేశ్… రాజకీయాలపై మక్కువతో వైసీపీలో చేరిపోయారు. సురేశ్ కు జగన్ వద్ద టాప్ ప్రయారిటీనే దక్కింది. జగన్ తన కేబినెట్ ను షఫిల్ చేసిన సందర్భంగా మంత్రి పదవులు నిలబెట్టుకున్న అతి కొద్ది మందిలో సురేశ్ ఒకరు. అంతేకాకుండా సురేశ్ కు ప్రమోషన్ కూడా దక్కింది. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన అదికారిక నైపుణ్యాన్ని వినియోగించి సురేశ్ బాగానే రాణించారు. అయితే ఇప్పుడు సురేశ్ కూడా పార్టీని వీడుతున్నారని ప్రచారం జోరు అందుకుందట.
ఈ వార్తలు చెవిన పడినంతనే…సింగరాయకొండకు పరుగు పరుగున వచ్చిన సురేశ్… పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాను కూడా పిలిచి తనపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమని తెలిపారు. ఈ సందర్భంగా ఓ విలేకరి నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్నా అని ప్రశ్నించారట. దానికి ఒకింత భావోద్వేగమైన సమాధానం ఇచ్చిన సురేశ్.. తన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తాను జగన్ వెంటే నడుస్తానని చెప్పారు. వైసీపీని వీడే ప్రసక్తే లేదన్నారు. జగన్ ను తాను ఓ నమ్మిన బంటునని కూడా ఆయన చెప్పుకొచ్చారు. జగన్ చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేసే వారిలో తానే మొదటి వరుసలో ఉంటానని కూడా ఆయన చెప్పుకొచ్చారట.
This post was last modified on January 31, 2025 12:17 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…