Political News

నాడు ఈ గవర్నెన్స్… నేడు వాట్సాప్ గవర్నెన్స్

1995…ఉమ్మడి ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. టీడీపీలో చోటుచేసుకున్న పలు కీలక పరిణామాల నేపథ్యంలో నాడు యువ నేతగా ఉన్న నారా చంద్రబాబునాయుడు తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అప్పటిదాకా సీఎంగా వ్యవహరించిన వారంతా ఫక్తు రాజకీయ నాయకులే.

పెద్దగా టెక్నాలజీపై అవగాహన లేని వారే. అయితే చంద్రబాబు ఏపీ ప్రజలకు సరికొత్త పాలనను అందించారు. అప్పటిదాకా కరెంటు బిల్లు కట్టేందుకు వచ్చిన వారితో విద్యుత్ శాఖ కార్యాలయాల ముందు భారీ క్యూలు కనిపించగా… చంద్రబాబు వాటిని మాయం చేశారు.

అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ని అందిపుచ్చుకున్న చంద్రబాబు… మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ ఏపీ పాలనను సమూలంగా ప్రక్షాళన చేసింది. అందుబాటులోకి వచ్చిన ఐటీని సద్వినియోగం చేసుకున్న చంద్రబాబు ఈ సేవా సెంటర్ల పేరిట వినియోగదారుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కరెంటు బిల్లులతో పాటు ఇతరత్రా శాఖల సేవలు కూడా ఈ కేంద్రాల ద్వారా జనానికి ఈజీగా అందేలా చర్యలు చేపట్టారు. చంద్రబాబు దూరదృష్టితో ప్రారంభించిన ఈ సేవా సెంటర్లు సక్సెస్ కావడంతో… అదే తరహా కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యాయి.

తాజాగా ఇప్పుడు ఐటీని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డామినేట్ చేస్తోంది. 1995లో ఐటీ విజృంభిస్తున్న వేళ చంద్రబాబు ఎలా అయితే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారో… అలాగే ఇప్పుడు ఏఐ తన ప్రభావం చూపడం మొదలుపెట్టిన 2025లోనూ చంద్రబాబు ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఇంకేముంది నాడు ఐటీని వాడుకున్నట్లుగానే… ఇప్పుడు ఏఐని వాడుకునేందుకు ఆయన రంగంలోకి దిగారు. అది కూడా అందరి కంటే ముందుగా ఏఐపై చంద్రబాబు దృష్టి సారించారు. పలితంగా ఏపీలో గురువారం వాట్సాప్ గవర్నెన్స్ లాంఛనంగా ప్రారంభమైంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ నూతన తరమా పాలనా విధానాన్ని ప్రారంభించారు.

నాడు ఈ సేవా కేంద్రాలు ఎలా అయితే సక్సెస్ అయ్యాయో… నేడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా డబుల్ సక్సెస్ కావడం ఖాయమేనని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రజలు ఇంటిలో కూర్చునే… దాదాపుగా అన్ని రకాల పౌర సేవలను తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా అందుకోనున్నారు. ఏ ఒక్క సేవ కోసం కూడా జనం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.

అంతేకాకుండా జవాబుదారీ తనం కూడా పెరుగుతుంది. నకిలీల బెడద తగ్గుతుంది. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు మాత్రమే అందనున్నా… భవిష్యత్తులో అన్ని రకాల పౌర సేవలు దీని ద్వారానే అందనున్నాయి. అంటే… నాడు ఐటీతో పాలనను సమూలంగా మార్చేసిన చంద్రబాబు… ఇప్పుడు ఏఐతో ప్రభుత్వ పాలనను మరింతగా సులభతరం చేయనున్నారన్న మాట.

This post was last modified on January 30, 2025 7:48 pm

Share
Show comments

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

31 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

8 hours ago