రాష్ట్రంలో కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని.. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదని.. పెద్ద ఎత్తున యాగీ చేస్తున్న విషయం రెండు రోజులుగా చర్చనీయాంశం అయింది. అయితే.. తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్వయంగా చెబుతున్నారు.
పైగా వైసీపీ ప్రచారాన్ని నమ్మవద్దని కూడా ప్రజలను కోరుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో రాష్ట్రం లో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది. మరి దీనిని సద్వి నియోగం చేసుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందా? ప్రభుత్వంపై ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత ఉంటే.. ఈ ఎన్నికలను ఆసరా చేసుకుని వైసీపీ దానిని నిరూపించే అవకాశం ఉంటుంది. ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ, వైసీపీ ఈ విషయంలో చేతులు ఎత్తేసింది.
రెండు గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోస్టుకు ఎన్నికలు జరగనున్నా.. వైసీపీ నుంచి ఉలుకు పలుకు లేకుండా పోయింది. ఎవరూ కూడా పోటీ చేసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. అంటే.. ఒకరకంగా వైసీపీ ఈ ఎన్నికలను వదిలేసుకున్నట్టే అయింది. దీంతో స్వల్ప పోటీ మినహా.. కూటమి మద్దతుతో రంగంలోకి దిగిన.. అభ్యర్థుల విజయం దాదాపు ఖరారైంది. వాస్తవానికి నామినేషన్లకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో వైసీపీ పోటీకి దిగి.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని నిరూపించుకునే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
కానీ, అలా చేయకుండా కేవలం మీడియా ముందు మాత్రమే కొన్ని కామెంట్లు చేసి.. చేతులు దులుపుకొం టే పార్టీపై విశ్వసనీయత మరింత మృగ్యమవుతుందని అంటున్నారు. ఇక, ఆ తర్వాత.. జగన్ చెప్పే విశ్వసనీయత, విలువలు వంటివాటికి చాపచుట్టేయడమే బెటర్ అన్న వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం. ఏదేమైనా.. ఈ విషయంలో వైసీపీ వేసే అడుగులు పార్టీ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయని కూడా అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on January 30, 2025 10:32 am
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…