Political News

పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విచారణకు పవన్ ఆదేశం

వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ అండ చూసుకొని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు మొదలు మంత్రుల వరకు అందరూ భూ ఆక్రమణలు, కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆఖరికి అటవీ భూములను కూడా వదలని వైనం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి అక్రమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశించారు.

చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ సమాచారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను పవన్ ఆదేశించారు. అంతేకాదు, వెంటనే ఆ వ్యవహారంపై ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పి.సి.సి.ఎఫ్.కు ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని, తగిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు.

అడవులను ఏ విధంగా ధ్వంసం చేశా, పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని అటవీ శాఖ అధికారులకు పవన్ చెప్పారు. ఎంత అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైందో తేల్చాలని, అటవీ భూముల రికార్డులు తారుమారు చేశారా? అన్న కోణంలో పరిశీలించాలని ఆదేశించారు. ఒకవేళ రికార్డులు తారుమారు చేస్తే అందుకు బాధ్యులెవరూ? తద్వారా లబ్ధి పొందింది ఎవరో నివేదికలో పేర్కొనాలని పవన్ చెప్పారు.

కాగా, పెద్దిరెడ్డి తమ భూములను కబ్జా చేశారని గతంలో బాధితులు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమను బెదిరించి పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పవన్ తాజా నిర్ణయంతో పెద్దిరెడ్డికి చిక్కులు తప్పేలా లేవు.

This post was last modified on January 29, 2025 3:29 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

1 hour ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago