గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు తాజాగా రిలీఫ్ దక్కింది. గత 145 రోజులుగా జైల్లోనే ఉన్న నందిగం… తాజాగా బుధవారం ఉదయం 7 గంటల సమయంలో గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే.. ఆయన వెంటనే కాలర్ బోన్ చికిత్స నిమిత్తం విజయవాడకు తరలి వెళ్లారు. గత కొన్నాళ్లుగా నందిగం కాలర్ బోన్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన చికిత్స పొందారు.
ఎందుకీ జైలు!
అమరావతి ప్రాంతం పరిధిలోని ఓఎస్సీ కాలనీలో మాదిగ, మాల సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాలు ఉంటున్నాయి. ఈ కాలనీకి ముందు భాగంలో భారీ ఆర్చి నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో మాల-మాదిగ సామాజిక వర్గాల కుటుంబాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇది అప్పటి ఎంపీ నందిగం వరకు చేరింది. ఈయన మాదిగ సామాజిక వర్గానికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో మరిన్ని గొడవలు చెలరేగి.. మరియమ్మ అనే మహిళ చనిపోయింది.
ఇది వైసీపీ హయాంలోనే జరిగినా.. కేసు నమోదు చేసినా.. పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక.. మరియమ్మ కుమారుడు నారా లోకేష్‌ను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. నందిగంను అరెస్టు చేసి .. జిల్లా జైలుకు తరలించారు. ఇక, తనపై కేసు కొట్టేయాలంటూ.. ఆయన హైకోర్టు సుప్రీంకోర్టుల వరకు వెళ్లినా.. నేర చరిత్రను సొంతం చేసుకున్నారంటూ.. న్యాయస్థానాలు వ్యాఖ్యానించారు. చివరకు తాజాగా 145 రోజుల అనంతరం.. అనారోగ్య కారణాలతో బెయిల్ తెచ్చుకున్నారు.
అయితే.. తాజాగా విజయవాడ కృష్ణ లంక పోలీసులు మరో కేసును తెరమీదికి తెచ్చారు. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసులో తాజాగా నందిగం సురేష్‌కు నోటీసులు ఇవ్వనున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అప్పట్లో నందిగం అనుచరులు మద్యం తాగి.. విజయవాడ బస్టాండ్ వద్ద హల్చల్ చేశారు. ఈ క్రమంలో వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన అప్పటి ఎంపీ సురేష్ తెల్లవారు జామున స్టేషన్‌కు వచ్చి.. పోలీసులను దుర్భాషలాడారని.. పోలీసుల అదుపులో ఉన్న తన అనుచరులను బలవంతంగా తీసుకువెళ్లారన్నది అభియోగం. ఈ కేసు తాజాగా తెరమీదికి వచ్చింది. దీంతో నందిగం మరోసారి జైలుకు వెళ్లక తప్పదా? అనే చర్చ సాగుతోంది.
This post was last modified on January 29, 2025 9:51 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…