జనసేన కీలక నేత, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేశ్ రాకతో ఏపీ పర్యాటక శాఖకు బూస్ట్ వచ్చిందనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని రీతిలో టూరిజం శాఖలో సరికొత్త కార్యక్రమాలను చేపడుతున్న దుర్గేశ్… టూరిజం డెవలప్ మెంట్ కోసం నయా పంథాను అనుసరిస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర పర్యాటక రంగంలో నూతన పెట్టుబడులు రావడం మొదలైంది. ఈ రంగంలో పెట్టుబడుల కోసం ప్రత్యేక సదస్సుల దిశగా సరికొత్త అడుగు వేసిన దుర్గేశ్.. తాజాగా మరో కొంగొత్త నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తరాంధ్రలోని అరకు పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏటా ఇక్కడికి వేలాది మంది పర్యాటకుల వస్తున్నారు. అయితే వారి కోసం ఆయా ప్రభుత్వాలు ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలా లేదనే చెప్పాలి. తాజాగా కూటమి అధికారం చేపట్టాక.. దుర్గేశ్ పర్యాటక శాఖ బాధ్యతలు చేపట్టాక… అరకును మరింతగా ప్రొజెక్ట్ చేయాలన్న దిశగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగా అరకులో చలి పండుగ పేరిట 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని తీర్మానం జరిగింది.
ఈ చలి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.1 కోటి నిధులను విడుదల చేసింది. సాధారణంగా టూరిజం రిలేటెడ్ ప్రోగ్రామ్ లను స్పాన్సర్ షిప్ లతోనే సరిపెట్టేస్తుంటారు. సర్కారీ నిధులు పెద్దగా విడుదల కావు. ఈ కారణంగా ఈ తరహా వేడుకలపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టదు. స్పాన్సరర్ల పెత్తనమే రాజ్యమేలుతుంది. ఫలితంగా వచ్చే ఆదాయం అంతా వారి జేబుల్లోకే వెళుతుంది.ఇకపై అలా కాకూడదన్న భావనతో దుర్గేశ్… సీఎం చంద్రబాబుతో తన ప్లాన్ ను వివరించి నిధుల కోసం అభ్యర్థించారు.
టూరిజం డెవలప్ మెంట్ పై దుర్గేశ్ దూరదృష్టిని గ్రహించిన చంద్రబాబు…దుర్గేశ్ కోరిన మేరకు అరకు చలి పండుగకు రూ.1 కోటి కేటాయించారు. దీని కంటే ముందు ఇటీవలే తిరుపతిలో నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ కు కూడా రూ.1 కోటి విడుదల చేశారు. చంద్రబాబు నుంచి అందిన ప్రోత్సాహంతో అరకు చలి పండుగను సరికొత్త తరహాలో నిర్వహించేందుకు దుర్గేశ్ పకడ్బందీ ప్రణాళికలు రచించినట్లుగా సమాచారం. ఈ పండుగతో అరకుకు మరింత మంది పర్యాటకుల రాక ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది.
This post was last modified on January 29, 2025 7:48 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…