టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్… రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకూ మిడ్ డే మీల్స్ ను విస్తరించిన లోకేశ్.. తాజాగా మరో కీలక సంస్కరణకు తెర తీశారు. పాఠశాలల విద్యార్థులకు విద్యతో పాటు మానసిక ఉల్లాసం కూడా అవసరమన్న భావనతో… వారంతో ఓ రోజు నో బ్యాగ్ డే అమలు చేయాలని లోకేశ్ తీర్మానించారు. అంతేకాకుండా ఈ నో బ్యాగ్ డేను ప్రతి శనివారం అమలు చేయాలని ఆయన నిర్ణయించారు.
నో బ్యాగ్ డే నాడు విద్యను పక్కన పెట్టేసి… విద్యార్థులు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద దృష్టి పెడితే… వారిలో మానసిక వికాసం పెరుగుతుందన్నది లోకేశ్ భావన. ఈ కొత్త విధానం తన మదిలో మెదిలిన వెంటనే… దానిని విద్యాశాఖ ఉన్నతాధికారుల ముందు పెట్టిన లోకేశ్… దానిపై మరింతగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ తరహా నిర్ణయాలతో విద్యార్థులు మరింత ఉన్నతంగా రాణించే అవకాశాలున్నాయన్న నిపుణుల మాటతో ఈ విషయంలో ముందడుగు వేసేందుకే లోకేశ్ నిర్ణయించుకున్నారు.
విద్యా శాఖపై మంగళవారం జరిగిన సమీక్ష సందర్బంగా లోకేశ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నో బ్యాగ్ డేకు అనుగుణంగా పిల్లలకు సరిపడే యాక్టివిటీస్ ను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ సాయంతో ఉపాధ్యాయులకు మరింత తోడ్పాటు అందించడంతో పాటుగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉపాధ్యాయులు అనేక యాప్ లను వినియోగించాల్సి వస్తోందని… దీనిని నివారించేందుకు ఒకే ఒక యాప్ ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
This post was last modified on January 28, 2025 9:24 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…