భారత రాజకీయాల్లో మొనాటనీ రాజ్యమేలుంది,. ఇందుకు ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. చివరకు నీతి వాక్యాలు వల్లించే వామపక్షాలూ అతీతం కాదు. సీపీఎం, సీపీఐ పార్టీల్లో ఇప్పటికీ వృద్ధ సింహాలనే రాజ్యం. ఆ పార్టీలకు ఎప్పటినుంచో ఒకే నేత నేతృత్వం వహిస్తున్న వైనం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వామపక్షాలంటేనే.. కారత్, రాజా, ఏచూరీ, నారాయణ, వీరభద్రం అంతే…ఇతర నేతల పేర్లు వినిపిస్తే ఒట్టు.
ఇప్పుడు ఆ పార్టీలు కూడా కొత్త పంథాను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ద్వితీయ స్థాయి నేతలకు కూడా అవకాశం కల్పిద్దామనుకున్నారో… ఏమో తెలియదు గానీ… ఇప్పుడు సీపీఎం తెలంగాణ శాఖ ఓ కీలక అడుగు వేసింది. 70 ఏళ్ల వయసు పైబడ్డ వారిని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోరాదని ఓ కండీషన్ ను గట్టిగానే అమలు చేసింది. ఫలితంగా… సీపీఎం తెలంగాణ శాఖలో ఎంతోకాలంగా పాతుకుపోయిన తమ్మినేని వీరభద్రం, సీతారాములు, నర్సింగరావు వంటి వారికి రాష్ట్ర కిమటీలో చోటు దక్కలేదు.
సీపీఎం తెలంగాణ శాఖకు మంగళవారం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో 70 ఏళ్ల నిబంధనను తూచా తప్పకుండా పాటించారు. ఫలితంగా సీనియర్లంతా రేసు నుంచి తప్పుకోగా… పార్టీ కోసం విద్యార్థి దశ నుంచి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న జాన్ వెస్లీకి పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు దక్కాయి. సీపీఎం తెలంగాణ శాఖ కార్యదర్శిగా వెస్లీని ఎన్నుకున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
This post was last modified on January 28, 2025 7:42 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…