ప్రజా గాయకుడిగా తెలుగు ప్రజల నుంచి మంచి గుర్తింపు సంపాదించుకున్న గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వాలన్న తెలంగాణ సర్కారు డిమాండ్.. దానికి బీజేపీ ప్రతిస్పందించిన తీరుతో నెలకొన్న వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పుడు మాటల యుద్ధమే జరుగుతోంది. నిన్నటికి నిన్న తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్.. బరాబర్ గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి రచ్చకు శ్రీకారం చుట్టారు.
బండి వ్యాఖ్యలపై మూకుమ్మడి దాడికి దిగిన టీ కాంగ్రెస్ నేతలు వరుసబెట్టి కేంద్ర మంత్రిపై విరుచుకుపడిపోయారు. టీపీసీసీ అయితే ఏకంగా గద్దర్ మరణించిస సందర్భంగా ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ గద్దర్ సతీమణికు ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖను బయటపెట్టి మరీ ఎదురు దాడికి దిగింది. గద్దర్ బతికుండగా…ఆయనను బండి సంజయ్ ఆలింగనం చేసుకున్న వీడియోలను కూడా కాంగ్రెస్ పార్టీ బయటపెట్టి బీజేపీపై ఏకంగా ర్యాగింగ్ కే పాల్పడింది.
కాంగ్రెస్ ఇంతగా కార్నర్ చేస్తున్నా… బీజేపీలో ఎంతమాత్రం మార్పు రావడం లేదు. నిన్న తెలంగాణకు చెందిన బండి సంజయ్ ఈ వివాదానికి తెర తీస్తే… ఇప్పుడు ఏపీకి చెందిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దానికి మరింత ఆజ్యం పోశారు. బండి సంజయ్ ను మించి గద్దర్ పై విస్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి. బండి మాదిరిగానే విష్ణు కూడా గద్దర్ కు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి పారేశారు.
అయినా విష్ణు ఏమన్నారన్న విషయానికి వస్తే.. గద్దర్ పై అనేక కేసులు ఉన్నాయని విష్ణు అన్నారు. గద్దర్ అనేక మంది ప్రాణాలను తీశారని, ఈ లెక్కన గద్దర్ నరహంతుకుడేనని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. నిషేధిత మావోయిస్టు పార్టీలో ఉన్న గద్దర్ కు అవార్డు ఎలా ఇవ్వమంటారని ఆయన ప్రశ్నించారు. భారత ప్రజాస్వామ్య విధానాలకు గద్దర్ వ్యతిరేకన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. గద్దర్ కు ఎల్టీటీఈకి పెద్దగా తేడా లేదని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఎల్టీటీఈ చేతిలోనే రాజీవ్ హత్యకు గురైన విషయాన్ని ఈ సందర్భంగా విష్ణు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే… ఎల్టీటీఈ ఉగ్రవాదులకు కూడా పద్మ అవార్డులు ఇవ్వమంటారేమోనని విష్ణు వ్యంగ్యం ప్రదర్శించారు.
This post was last modified on January 28, 2025 11:45 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…