ఈ అంకెలేమిటి? వాటి మధ్య పర్సంటేజీలను గుర్తు చేస్తున్నట్లుగా ఆ డాట్స్ ఏమిటి? ఏమైనా గణిత పాఠాలు చెబుతున్నారా? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఇదేమీ మ్యాథ్స్ క్లాస్ కాదు గానీ… ఏపీలోని కూటమిలోని పార్టీల మధ్య కుదిరిన పదవుల పందేరానికి సంబంధించిన ఓ కీలక ఒప్పందం. అసలే మూడు పార్టీలు… అన్ని పార్టీల్లో వందల సంఖ్యలో ఆశావహులు. అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు కదా. అదే సమయంలో ఓ పార్టీకి ఎక్కువ పదవులు ఇచ్చి…మరో పార్టీకి తక్కువ పదవులు దక్కితే… అసలుకే ఎసరు తప్పదు. ఆ ముప్పు వద్దని భావించిన మూడు పార్టీల అధిష్ఠానాలు కలిసి కూర్చుని నిర్దేశించేందుకు పదవుల పర్సంటేజీలు ఇవి.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో జతకట్టిన జనసేన, బీజేపీలు మూకుమ్మడిగా వైసీపీని చిత్తు చేసి…94 శాతం సక్సెస్ రేటును సాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా, ఆయన నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్ లో మూడు పార్టీలకు ఆయా పార్టీలకు దక్కిన సీట్లు, ఓట్ల ఆధారంగా బెర్తులు దక్కాయి. తాజాగా నామినేటెడ్ పదవుల భర్తీకి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే రెండు దఫాలుగా నామినేడెట్ పదవుల భర్తీ జరిగినా… ఈ దఫా భర్తీ కాబోతున్న పదవులు చాలా కీలకమైనవిగా భావిస్తున్నారు. అందుకే… మిత్రపక్షాల మధ్య పొరపొచ్చాలు లేకుండా పదవులను పర్సంటేజీల ఆధారంగా పంచుకోవాలని తీర్మానించుకున్నారు.
కూటమికి కెప్టెన్ గానే కాకుండా కీలక ప్లేయర్ టీడీపీనే. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూస్తే… జనసేన, బీజేపీల సపోర్టు లేకుండానే సంపూర్ణ మెజారిటీ ఉంది. అయినా పొత్తు ధర్మాన్ని టీడీపీ గౌరవించింది. ప్రస్తుతం టీడీపీకి అసెంబ్లీలో 135 సీట్లు ఉండగా… జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. ఈ లెక్కన నామినేటెడ్ పోస్టులను కూడా పంచుకోవాలని కూటమి పార్టీలు తీర్మానించినట్లు సమాచారం. ఈ లెక్కన టీడీపీకి 80 శాతం, జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం పదవులు దక్కనున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా 50 దాకా కీలకమైన నామినేటెడ్ పోస్టులు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే వాటిలో అత్యధికంగా 30 నుంచి 35 పదవుల మేరకు మాత్రమే భర్తీ చేయాలని కూటమి పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఇప్పుడు భర్తీ కానున్న పదవుల్లో రాష్ట్ర మహిళా కమిషన్, కనకదుర్గమ్య ఆలయ కమిటి, స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ, మార్కెటింగ్ కమిటీలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయా పార్టీల నుంచి పదవులు ఆశించే నేతలు కూడా అదికంగానే ఉన్నారు. ఈ కారణంగానే పార్టీల మధ్య దూరం పెరగకుండా పర్సంటేజీల ఆధారంగా పదవుల పందేరానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.
This post was last modified on January 28, 2025 10:45 am
రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…
కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. కొన్ని పాటలు, సన్నివేశాలు కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. వర్షం…
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…
స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…