టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తెలుగు మాట్లాడేందుకు కాస్తంత ఇబ్బంది పడేవారు. దీంతో కొన్నిమీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు ఆయనను అనవసర ప్రశ్నలు సంధించి ఇబ్బంది పెట్టేందుకు యత్నించేవారు. లోకేశ్ కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు అలా కాదు. లోకేశ్ ఆరితేరిపోయారు. ఒకింత నాటుగా చెప్పాలంటే… రాటుదేలిపోయారు. ఇప్పుడు లోకేశ్ ను ప్రశ్నించాలంటే కాకలు తీరిన జర్నలిస్టులు కూడా ప్రిపేర్ అయి మరీ వెళ్లక తప్పదు. లేదంటే… లోకేశ్ చేతిలో చీవాట్లు తినక తప్పదు.
మొన్నటిదాకా లోకేశ్ ఎక్కడికి వెళ్లినా… జగన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని సాక్షి మీడియా ప్రతినిధులు ఆయనను ఇబ్బంది పెట్టేందుకు రెడీగా ఉండేవారు. అయితే ఇప్పుడు లోకేశ్ వస్తున్నారంటే… మనం ఎందుకు వెళ్లడం అన్నట్లుగా సాక్షిజర్నలిస్టులు జంకుతున్నారు. ప్రెస్ మీట్ మొదలు కాగానే… సాక్షి ఎక్కడ? అంటూ లోకేశ్ కామెంట్ చేస్తున్నారు. నేనే అంటూ సదరు ప్రతినిధులు చేతులెత్తితే సరేసరి.. అలా చేతులు లేవకపోతే… ఆ రోజు సాక్షి మీడియా లోకేశ్ సెటైర్ల వర్షంలో వణికి పోవాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే… సాక్షి మీడియాలోను లోకేశ్ ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పక తప్పదు. సోమవారం విశాఖ వెళ్లిన సందర్భంగానూ లోకేశ్ ఇదే తరహాలో సాక్షిపై మాస్ ర్యాగింగ్ కు దిగారు.
సాక్షినే కాదు… విషయాలపై అవగాన లేకుండా తనను అనవసర ప్రశ్నలతో సతాయించే జర్నలిస్టులను కూడా లోకేశ్ వదిలిపెట్టడం లేదు. సోమవారం నాటి విశాఖ టూర్ లో ఇది స్పష్టంగా కనిపించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి లోకేశ్ ఎంత చెబుతున్నా… పదే పదే అదే ప్రశ్న సంధించిన ఓ విలేకరి తీరుపై ఆయన ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. ఇలాగైతే కాదు స్వామీ,…మీరు కాస్తంత చదువుకుని రావాలి అంటూ సదరు విలేకరికి లోకేశ్ చురకలు అంటించిన వైనం నిజంగానే లోకేశ్ సత్తాకు నిదర్శనంగా నిలిచిందని చెప్పాలి.
మీడియా ప్రతినిధులతో పెట్టుకోవాలంటే భయపడని నేత అంటూ ఉండరు. వారితో మనకెందుకులే అన్న రీతిలోనే అందరూ సాగుతూ ఉంటారు. అయితే ఆ తరహా వైఖరికి లోకేశ్ పూర్తిగా భిన్నమనే చెప్పాలి. ఆయా విషయాలపై సమగ్ర అవగాహన, తప్పులు చేయకుండా సాగడం, అబద్ధాలు అసలే చెప్పకపోవడం, నిజాయతీగా సాగడం వంటి విషయాల్లో ఆరితేరిన లోకేశ్ మీడియాను చూసి భయపడటం లేదు. లోకేశ్ ను చూస్తే మీడియా ప్రతినిధులే కాస్తంత భయపడిపోయేంతగా పరిస్థితి మారిందని చెప్పక తప్పదు. అవగాహన కలిగిన జర్నలిస్టులను అక్కడికక్కడే మెచ్చుకునే లోకేశ్… విషయాలపై అవగాహన లేని వారిని మాత్రం ఓ ఆట ఆడుకునే విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అందుకే…లోకేశ్ ను ఫేస్ చేయాలంటే ఒకింత కష్టమేనని చెప్పక తప్పదు.
This post was last modified on January 27, 2025 9:07 pm
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…