వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించి కలకలం రేపారు కదా. ప్రకటించినట్లుగానే ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనాామా చేయాల్సింది మాత్రమే మిగిలి ఉంది. అది కూడా అయిపోతే… సాయిరెడ్డి రాజకీయాల నుంచి నిష్క్రమించినట్లే. ఆ రాజీనామా ఎప్పుడు చేస్తారో తెలియదు గానీ… తాను చెప్పినట్లుగానే వ్యవసాయంలోకి ఆయన అప్పుడే దిగిపోయారు.
ఈ మేరకు సోమవారం రాత్రి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిరెడ్డి… తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. ప్రదేశం ఎక్కడిదన్న విషయాన్ని మాత్రం సాయిరెడ్డి చెప్పలేదు గానీ… సాయిరెడ్డి పెద్ద ఫామ్ ల్యాండ్ నే కొనుగోలు చేసినట్లున్నారు. ఎంచక్కా టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ లోకి మారిపోయిన సాయిరెడ్డి మోడర్న్ ఫార్మర్ లుక్ లో దర్శనమిస్తున్నారు. మిలిటరీ టైపు జీపులో తన ఫామ్ ల్యాండ్ కు వెళ్లిన సాయిరెడ్డి… అందులోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
This post was last modified on January 27, 2025 8:54 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…