పరిటాల…ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. అటు రాజకీయంగా అయినా… ఇటు ఆయా ప్రాంతాలపై పట్టు విషయంలో అయినా ఈ ఫ్యామిలీ చెప్పిందే దాదాపుగా జరిగి తీరుతుంది. ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లా కేంద్రంగా రాజకీయాలు సాగిస్తున్న ఈ కుటుంబంలో ప్రస్తుతం మూడో తరం యమా యాక్టివ్ గా ఉంది. దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల శ్రీరామ్ అనంత జిల్లా టీడీపీ శ్రేణులకు ఆశాదీపంగా నిలుస్తున్నారు.
రాజకీయంగానే కాకుండా మాస్ ఫాలోయింగ్ లో ఓ రేంజికి ఎదిగిన శ్రీరామ్ కు ఎందుకనో కాలం కలిసి రావట్లేదు. 2019 ఎన్నికల్లో తన ఫ్యామిలీకి పెట్టని కోటగా ఉన్న రాప్తాడు ఎమ్మెల్యేగా బరిలోకి దిగి వైసీపీ దిశగా వీచిన గాలిలో ఓటమి చవిచూశారు. ఇక 2024 ఎన్నికల్లో పొత్తు ధర్మం శ్రీరామ్ ముందరి కాళ్లకు బంధం వేసింది. రాప్తాడును తన తల్లి, మాజీ మంత్రి పరిటాల సునీతకు కేటాయించడంతో పాటుగా తనకు ధర్మవరం సీటు కేటాయించాలని ఆయన టీడీపీ అధిష్ఠానాన్ని కోరారు. అయితే పొత్తు ధర్మం నేపథ్యంలో ఆ సీటు బీజేపీ కోటాలోకి పోవడంతో శ్రీరామ్ అసలు పోటీనే చేయలేకపోయారు. ఆ సీటును దక్కించుకున్న బీజేపీ నేత సత్య కుమార్ యాదవ్ ఇప్పుడు ఏకంగా మంత్రి పదవిలో ఉన్నారు.
తాజాగా ధర్మవరంలో మరోమారు శ్రీరామ్ వెనుకంజ వేయక తప్పలేదు. గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసి… 2019లో వైసీపీలో చేరి… తాజాగా బీజేపీలో చేరిన జమీర్ విషయంలో ఆదివారం ధర్మవరంలో రచ్చ సాగింది. తమ పార్టీని వీడి ఇప్పుడు.. తమతో పొత్తులో ఉన్న బీజేపీలోకి ఎలా వస్తారంటూ జమీర్ ను శ్రీరామ్ వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు ధర్మవరంలో మోహరించాయి.
తాజాగా సోమవారం జమీర్ తాను అనుకున్నట్లుగానే బీజేపీలో చేరిపోయారు. ధర్మవరంపై పట్టు విషయంలో శ్రీరామ్ తో సత్యకుమార్ యాదవ్ అంతగా కలిసిరావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో శ్రీరామ్ వర్గం వ్యతిరేకించినా కూడా జమీర్ ను సత్యకుమార్ యాదవ్ బీజేపీలో చేర్చేసుకున్నారు. అయితే తన వర్గంతో ప్రత్యేక సమావేశం అయి భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనక రంగంలోకి దిగిన శ్రీరామ్… పోలీసుల సూచనలు, పొత్తు ధర్మాన్ని మదిలో ఉంచుకుని శ్రీరామ్ తన సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.
This post was last modified on January 27, 2025 3:52 pm
వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించి కలకలం రేపారు కదా. ప్రకటించినట్లుగానే ఆయన తన…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ నేతలు…
ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రానికి పోయిన పేరును తీసుకువచ్చేందుకు.. గత ప్రాభవం నిలబెట్టేందుకు కూటమి పార్టీలు…
అప్పుడెప్పుడో ఇంగ్లాండ్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టినట్టు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం…
గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోవడంతో మెగాభిమానుల దృష్టి ఆర్సి 16 వైపుకు వెళ్తోంది. తాజాగా మూడో షెడ్యూల్ మొదలుపెట్టిన దర్శకుడు…
వారసత్వ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అవకాశాలు అందిపుచ్చుకున్నవారే ఏ రంగంలోనైనా రాణిస్తారని,…