ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రానికి పోయిన పేరును తీసుకువచ్చేందుకు.. గత ప్రాభవం నిలబెట్టేందుకు కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వీటిలో టీడీపీ దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రినారా లోకేస్‌లు పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. ఒప్పందాలు చేసుకోలేదు కానీ.. పారిశ్రామిక వేత్తలను ఒప్పించారు. దీనికి సంబంధించిన ఫలాలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయి.
ఇక, బీజేపీ విషయానికి వస్తే.. నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించకపోయినా.. కేంద్రం నుంచి పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే.గత నెలలో విశాఖకు రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వచ్చాయి. ప్రధాని మోడీ నేరుగా విశాఖకు వచ్చి శంకుస్థాపనలు కూడా చేశారు. ఇక, ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. కూటమి పార్టీల ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తనదైన పంథాలో పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
దీనిలో భాగంగా జనసేన నాయకుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వరంలో పర్యాటక పెట్టుబడుల వేట ప్రారంభమైంది. దీనికి సంబంధించిన సదస్సును విశాఖలో సోమవారం నుంచి ప్రారం భిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ పర్యాటక పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అడ్వెంచర్, క్రూయిజ్, ఎకోటూరిజం, అరకు టూరిజం రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకువ చ్చేందుకు మంత్రి కందుల ప్రయ త్నిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యాటకం అభివృద్ది చెందడంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నది మంత్రి చెబుతున్న మాట. మొత్తానికి జనసేన ప్రయత్నంతో పర్యాటక పెట్టుబడుల్లో ఊపు వస్తుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 27, 2025 3:52 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…