టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ నిజంగానే ప్రతి విషయంలోనూ వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు. ఏం చేసినా.. తనదైన శైలిలో చేసుకుపోతున్న లోకేశ్ పై జనం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సొమ్మును అనవసరంగా ఖర్చు చేసేందుకు ససేమిరా అంటున్న లోకేశ్… తనదైన శైలి ప్రత్యేక మార్గంలో పయనిస్తూ ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విషయంలో లోకేశ్ లా వ్యవహరించిన నేతలు దేశ చరిత్రలోనే వేళ్లమీద లెక్క పెట్టొచ్చన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.
సరే… అసలు విషయంలోకి వెళితే… 2019లో వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి దినపత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. చినబాబు చిరుతిండి… 25 లక్షలండి… అన్న శీర్షికన లోకేశ్ పై ఆ పత్రిక ఓ వ్యతిరేక కథనం రాసింది. మంత్రి హోదాలో విశాఖ వచ్చిన సందర్భంగా ఎయిర్ పోర్టు లాంజిలో స్నాక్స్ కోసం ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు చేశారన్నది ఆ కథనం సారాంశం.
ఈ కథనంపై లోకేశ్ భగ్గుమన్నారు. సాక్షికి నోటీసులు పంపారు. సాక్షి స్పందించకపోవడంతో దానిపై విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ కోసం సోమవారం లోకేశ్ విశాఖ వచ్చారు. కేసు విచారణ వాయిదా పడటంతో తిరిగి అమరావతి బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.
తాను ప్రస్తుతం మంత్రిగా ఉన్న విషయాన్ని గుర్తు చేసిన లోకేశ్… తాను మంత్రి హోదాలో ఇప్పుడు విశాఖకు రాలేదన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా ఓ పత్రిక రాసిన కథనంపై న్యాయ పోరాటం చేసేందుకు వ్యక్తిగత హోదాలోనే వచ్చానన్నారు. ఈ కారణంగా తన పార్టీకి చెందిన బస్సులో నిద్రించానని, భోజనాన్ని కూడా తన సొంత డబ్బులతోనే తెప్పించుకున్నానని తెలిపారు. కనీసం వాటర్ బాటిల్ కోసం కూడా ప్రజా ధనాన్ని వినియోగించలేదన్నారు. సొంత కారులోనే వచ్చానని, దానిలో పెట్రోల్ కూడా సొంత డబ్బుతోనే పోయించుకున్నానని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తాను ఈ దిశగా కీలక అడుగులు వేసేందుకు తన మాతృమూర్తి నారా భువనేశ్వరి కారణమని లోకేశ్ తెలిపారు. ఎక్కడా ప్రభుత్వంపైన ఆదారపడకూడదని తన తల్లి తనకు చిన్నప్పటి నుంచి చెప్పేదని… ఇప్పుడు అదే అలవాటు అయ్యిందని ఆయన తెలిపారు. ఓ వైపు చోటా మోటా పదవులు దక్కినంతనే… సీఎం, పీఎంల మాదిరిగా దర్జా ఒలకబోస్తున్న నేతలు నానాటికీ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో లోకేశ్ తన తల్లి మాట మేరకు ప్రజా ధనం దుర్వినియోగానికి మాత్రం పాల్పడేది లేదని లోకేశ్ చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉంటే… సాక్షిపై పరువు నష్టం కేసు విచారణను కోర్టు వాయిదా వేసిందని లోకేశ్ తెలిపారు. ఇప్పటికే నాలుగు వాయిదాలకు తాను హాజరయ్యానని చెప్పిన ఆయన..ఇంకెన్ని వాయిదాలకు రమ్మన్నా వస్తానని తెలిపారు. ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని తెలిపారు. నిజం తన వైపు ఉందని, కాస్తంత ఆలస్యం అయినా ఈ కేసులో విజయం తనదేనని కూడా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on January 27, 2025 1:34 pm
భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణలో రచ్చ మొదలైంది.…
సమాజం మీద సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం పాజిటివ్ గా ఏమో కానీ నెగటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుందనే దానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ గతంలో చేపట్టిన ప్రతిష్ఠాత్మక యువగళం పాదయాత్రకు నేటితో సరిగ్గా…
వస్తువైనా సినిమా అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ చాలా అవసరం. లేదంటే జనాలు పట్టించుకోకపోయే ప్రమాదముంది. ప్యాన్ ఇండియా మూవీకి…
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికంతా…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోమవారం పొద్దుపొద్దునే భారీ ఉపశమనం లభించింది. జగన్…