తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ కనిపించింది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి… అంచనాలకు మించి భారీ స్థాయిలో పెట్టుబడులు సాధించి తిరిగి వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఆయనకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున వెల్కమ్ చెప్పాయి. ఈ వీడియో అలా ట్రెండ్ అవుతున్న సమయంలోనే… అదే పార్టీకి చెందిన మరో వీడియో ఎంట్రీ ఇచ్చి… రేవంత్ వెల్కమ్ వీడియోను బీట్ చేస్తూ వైరల్ అయిపోయింది.
ఈ వైరల్ వీడియోలో ఏముందన్న విషయానికి వెళితే…కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి… కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న మహిళా ఐఏఎస్ అధికారిణి పమేలా సత్పతిపై చిందులు తొక్కుతూ కనిపించారు. అదేదో క్లోజ్డ్ డోర్ లలో జరిగిన ఘటన కాదు. అందరూ చూస్తుండగానే.. అందరి మధ్యలోనే మహిళా అధికారి… అందులోనూ ఐఏఎస్ అధికారిణి అని కూడా చూడకుండా… బుద్ధుందా? అంటూ ఆమెపై పొంగులేటి నిజంగానే చిందులు తొక్కుతూ ఊగిపోయారు.
ఈ ఘటన కరీంనగర్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. నగరంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటించారు. స్థానిక ఎంపీ హోదాలో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటు పొంగులేటి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలోనే పొంగులేటి కలెక్టర్ పై విరుచుకుపడిపోయారు. ఇది చాలదన్నట్లుగా పొన్నం మరేదో చెప్పి లేడీ కలెక్టర్ పై పొంగులేటి మరింత ఫైర్ అయ్యేలా చేయడం గమనార్హం. సౌమ్ముడిగానే కనిపించే పొంగులేటి… ఇలా అధికారులపై దురుసుగా ప్రవర్తించిన దాఖలా గతంలో లేదు. అయితే ఇప్పుడు ఐఏఎస్ అధికారి… అది కూడా ఓ మహిళా అధికారిపై ఆయన చిందులు తొక్కి వివాదంలో చిక్కుకున్నారు.
This post was last modified on January 25, 2025 9:29 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…