Political News

అందరికీ ఈ జిల్లా నేతలు ఆదర్శం… ఎందుకంటే?

నిజమే… తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు అందరికీ ఆదర్శమని చెప్పాలి. ఎందుకంటే.. పార్టీలు వేరైనా… తమ జిల్లా విషయానికి వచ్చేసరికి వారంతా ఏకతాటిపైకి వచ్చేస్తారు. అందరూ ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతారు. ఫలితంగా అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారు జిల్లాకు కావాల్సిన మేర నిధులు సాధించుకుంటారు. పనులూ నిర్ణీత సమయంలోగానే పూర్తి చేసుకుంటారు. ఇక రాజకీయ వైరం అంటారా?…అది ఎన్నికల వరకేనట. ఆ తర్వాత జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామని ఆ జిల్లా నేతలు చెబుతున్నారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు ఇప్పుడు రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ రాష్ట్ర కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు కరీంనగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆయన మంత్రిగా కూడా కొనసాగారు.

ఇలా ఈ మూడు పార్టీలకు చెందిన కీలక నేతల మధ్య అంతటి సఖ్యత ఎప్పుడు కనిపించిందంటే.. కరీంనగర్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక మీద ఖట్టర్ తో పాటు స్థానిక ఎంపీ హోదాలో కేంద్ర మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే హోదాలో గంగుల కమలాకర్, జిల్లాకు చెందిన మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్య ఆసీనులయ్యారు. ఇక తెలంగాణ కేబినెట్ లో మరో కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ వేదిక మీద కనిపించారు.

ఈ సందర్భంగా మైకు అందుకున్న బండి సంజయ్… తనకూ పొన్నం ప్రభాకర్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని ప్రకటించారు. అదే సమయంలో గంగుల కమలాకర్ తో కొంత గ్యాప్ ఉండేదని, అది కూడా ఈ సమావేశంతో పోయినట్టేనని వ్యాఖ్యానించారు. మొత్తంగా పార్టీలు వేరైనా పొన్నం, గంగులలతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని, ఇకపై రాదని కూడా బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అంతటితో ఆగని బండి… తమ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని పొరుగు జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి ఎప్పుడో గమనించారని కూడా అన్నారు. ఖమ్మం జిల్లాలో నిత్యం పార్టీల మధ్య గొడవలు జరుగుతాయని, కరీంనగర్ లో అలాంటి గొడవలే ఉండవని పొంగులేటి గతంలో చాలా సార్లు వ్యాఖ్యానించారని కూడా సంజయ్ గుర్తు చేశారు. సంజయ్ నోట ఈ వ్యాఖ్యలు విన్నంతనే సభకు హాజరైన జనం చప్పట్లతో తమ నేతలకు అభివాదం తెలిపారు.

This post was last modified on January 24, 2025 3:33 pm

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

5 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

6 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

7 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

11 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

11 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

13 hours ago