ఏపీ సీఎం చంద్రబాబు.. అనూహ్యంగా ఢిల్లీ బాట పట్టారు. గురువారం అర్ధరాత్రి ఆయన ఢిల్లీలో దిగిపోయారు. ఈ అనూహ్య పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఈ నెల 19న ఆయన స్విట్జర్లాండ్‌లో ని దావోస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. అయితే.. వాస్తవానికి ఈ సదస్సు శనివారం వరకు ఉంది. 20న ప్రారంభమైన సదస్సు ఐదు రోజుల పాటు జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదు రోజులకు సరిపోయేలా చంద్రబాబు కూడా షెడ్యూల్ వేసుకున్నారు.
ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్‌లు ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ పర్య టన శనివారం రాత్రికి ముగిసి.. ఆదివారం మధ్యాహ్నానికి ఏపీకి ఈ బృందం చేరుకుంటుందని ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొన్నారు. అంతా సజావుగానే సాగుతున్న క్రమంలో అనూహ్యంగా చంద్రబాబు తన పర్యటనను నాలుగు రోజులకే కుదించుకుని గురువారం సాయంత్రమే దావోస్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. అది కూడా ఆయన ఏపీకి రాకుండా.. ఢిల్లీలో ఆగిపోయారు.
దావోస్ నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు ఇక్కడి ఏపీ భవన్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. సహా పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నట్టు తెలిసింది. మరో వారంలో కేంద్రం 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రాధాన్యాలు.. ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు అత్యవసరంగా చర్చించనున్నారని అధికారులు చెబుతున్నారు.
వాస్తవానికి ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి చర్చలు పూర్తయ్యాయి. అయితే.. చివరి నిముషంలో ఏదైనా మార్పులు ఉండే అవకాశం ఉందని.. అందుకే చంద్రబాబు పోలవరం, అమరావతి, వెనుకబడిన జిల్లాలకు సంబంధించి నిధుల కేటాయింపుపై చర్చించేందుకు ఢిల్లీ బాట పట్టారని అంటున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయా ఫ్రమ్ వాల్ నిర్మాణంపైనా చంద్రబాబు చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. మొత్తానికి దావోస్ పర్యటనను మధ్యలోనే ముగించడం.. కేంద్ర మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
This post was last modified on January 24, 2025 10:13 am
ఏపీలో రాజకీయం నానాటికీ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంటే… రికార్డు విక్టరీ కొట్టిన…
2025 తొలి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ నమోదు చేసే దిశగా పరుగులు పెడుతున్న సంక్రాంతికి వస్తున్నాం పది రోజులకే 230…
భారీ అంచనాలతో రామ్ చరణ్ మూడేళ్లు వెచ్చించిన గేమ్ ఛేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే…
కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా?…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు.…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి చొరబడ్డ ఆ దొంగ ఏం తీసుకెళ్లలేకపోయాడు గానీ… అతడి కత్తి మాత్రం…