రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే పోతున్నట్టు కుదరదు. ప్రతి విషయానికీ పక్కా లెక్కలు ఉండాల్సిందే. అందుకే.. ఆరు మాసాలు గడవగానే చంద్రబాబు మంత్రుల వ్యవహార శైలిపై సంతృప్త స్థాయి లెక్కలు తీశారు. దీనిని ఇటీవల ఆయన దావోస్‌కు వెళ్లే ముందు ప్రస్తావించినా.. వాటి వివరాలను మాత్రం చెప్పలేదు. దీంతో మంత్రుల్లో టెన్షన్ నెలకొంది.
ఇదేమీ రహస్యం కాకపోవడంతో ప్రజల సంతృప్తి స్థాయి తమపై ఎలా ఉందన్న విషయాన్ని మంత్రులు వ్యక్తిగతంగా సీఎంవోను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనిలో మంత్రులు సగం మందికిపైగా బాగానే పనిచేస్తున్నట్టు తెలుసుకుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం గమనార్మం. అనగాని సత్య ప్రసాద్.. ఈ జాబితాలో ముందున్నట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ఆయన వైసీపీ హయాంలో జరిగిన భూకబ్జాలను వెలికి తీసి.. ప్రజలకు న్యాయం చేస్తామన్న భరోసా ఇస్తుండడంతో ఆయనపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని తెలిసింది.
ఇక, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవి కుమార్ ఈ సంతృప్త జాబితాలో నాలుగోస్థానంలో ఉన్నట్టు తెలిసింది. తొలి రెండు మూడు మాసాల్లో ఆయన గ్రాఫ్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. విద్యుత్ చార్జీల పెంపు.. ఇతర చార్జీల పై ప్రజల్లో నెలకొన్న ఆందోళనతో ఆయన గ్రాఫ్ నాలుగోస్థానానికి పరిమితమైందని తెలిసింది. ఇక, కీలకమైన హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత 8వ స్థానంలో ఉన్నారని తెలిసింది. ఆమె పర్యటనలు చేస్తున్నా.. హోం మంత్రిగా పోలీసులపై పక్కా పట్టు సాధించలేక పోవడంతోపాటు.. స్టేషన్ల పనితీరులోనూ మార్పు రాకపోవడంతో ప్రజల్లో పోలీసులపై ఉన్న భావన ఏమాత్రం తొలిగిపోకపో వడమే దీనికి కారణమని అంటున్నారు.
ఇక, మంత్రి నారా లోకేష్ గ్రాఫ్.. 2గా ఉందని తెలిసింది. వాస్తవానికి నారా లోకేష్ స్తానం 1గా ఉంటుందని అందరూ భావించారు. అయితే.. ఇంకా పనితీరు విషయంలో ప్రజలకు సరైన సమాచారం లేకపోవడం.. పైగా పాఠశాలల విషయంలో చేస్తున్న ప్రయోగాలు.. డీఎస్సీ ప్రకటించినప్పటికీ.. ఇంకా పక్కా ప్రకటన లేక పోవడం వంటివి ఆయనను రెండో స్థానానికి పరిమితం చేసినట్టు తెలిసింది. ఇక, మంత్రుల జాబితాలో చిట్ట చివరి స్థానంలో మంత్రి సంధ్యారాణి ఉన్నారన్నది సీఎంవో వర్గాలు చెబుతున్న మాట. గిరిజన సంక్షేమ మంత్రిగా ఉన్న ఆమె పనిచేస్తున్నప్పటికీ.. ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నారన్న చర్చ ఉంది.
This post was last modified on January 23, 2025 7:05 pm
నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…
ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్…
పుష్ప-2 విడుదలకు ముందు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయమై ఎంత గొడవ నడిచిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ఆరంభం…
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన సిద్దు జొన్నలగడ్డ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు…
‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే అసంతృప్తి…
మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో హీరోగా రూపొందుతున్న కన్నప్పలో ప్రభాస్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.…