జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకున్నట్టు జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. వారే.. ఒకరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే.. మరొకరు పార్టీ అగ్రనేత, పార్లమెంటు లో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఇద్దరి మధ్య గత రెండు మాసాలుగా పొరపొచ్చాలు చోటు చేసుకున్నాయని వార్తలు వస్తున్న మాట వాస్తవమే.
అయితే.. ఇప్పుడు ఈ వివాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నట్టు సమాచారం. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయని జాతీయ మీడియా చెబుతోంది. 1) ఇండియా కూటమి పటాపంచలు అయ్యే పరిస్థితి రావడం. 2) తనకు చెప్పకుండానే కీలక విషయాల్లో రాహుల్ వేలు పెట్టడంపై ఖర్గే అసహనంతో ఉండడం. 3) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షం ఆప్‌ను రాహుల్ కార్నర్ చేయడం. 4) ఖర్గే పార్టీని ముందుకు నడిపించలేక పోతున్నారన్న వాదన రాహుల్ కూటమిలో ఉండడం.
ఈ నాలుగు కారణాల్లో రెండు రెండు మాసాల నుంచి చర్చల్లోనే ఉన్నాయి. అయితే.. తాజాగా డిల్లీ ఎన్నికల విషయంలో రాహుల్ తనకు చెప్పకుండానే ఒంటరి పోరుకు ప్రకటన చేయడంపై ఖర్గే ఆవేదనతో రగిలిపోతున్నారన్నది పార్టీ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో కొద్దొ గొప్పో సీట్లు తీసుకుని ఆప్‌తో చెలిమి చేయడం ద్వారా.. బీజేపీకి అవకాశం లేకుండా చేయాలని ఖర్గే వాదన. అయితే.. ఈ విషయంలో పంతానికి పోయిన.. రాహుల్.. సొంతగానే పోటీకి రెడీ అయ్యారు. కానీ, ప్రస్తుతం ఓటు చీలితే.. అది బీజేపీకి లాభించి కుదిరితే అదికారంలోకి వచ్చినా రావొచ్చన్న చర్చ సాగుతోంది.
ఈ వ్యవహారాన్నే ఖర్గే తప్పుబడుతున్నారు. ఇక, మరో కీలక విషయం. కూటమి పార్టీలను సరైన దారిలో నడిపించకపోవడం. ఈ విషయంలో రాహులదే తప్పన్నట్టుగా.. ఖర్గే, కాదు.. అంతా ఖర్గేనే చేస్తున్నారని రాహుల్ బృందం చెబుతున్నాయి. ఎలా చూసుకున్నా.. ఇప్పుడు ఇండియా కూటమి విచ్ఛిన్నం దిశగా అయితే అడుగులు వేస్తోంది. దీనికి కారణంపై మీరంటే మీరంటూ.. ఖర్గే, రాహుల్ బృందాలు విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే.. ప్రస్తుతం ఇవేవీ అంత బహిరంగంగా బయట పడడం లేదు. రేపు ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. వచ్చే పరిణామాలను విశ్లేషించుకుని ఖర్గే రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియా వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on January 22, 2025 2:36 pm
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…