ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా పార్టీల్లో గుర్తంపు పొందిన పార్టీగా జనసేనను ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతేకాకుండా .జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తు ఇకపై ఆ పార్టీకి మాత్రమే చెందుతుందని కూడా తెలిపింది. ఈ మేరకు జనసేనకు గుర్తింపు పార్టీ హోదాను ఇస్తున్నట్లుగా ప్రకటించింది.
దేశంలోని రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం వివిధ కేటగిరీలుగా విభజించి గుర్తిస్తుంది. ప్రస్తుతం జనసేన కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పార్టీగానే కొనసాగుతోంది. గుర్తింపు కలిగిన పార్టీగా జనసేన లేదు. ఇదంతా ఆయా పార్టీలకు ఎన్నికల్లో వచ్చిన సీట్లు, దక్కిన ఓట్ల శాతం ఆధారంగా ఈ విభజన ఉంటుంది.
ఈ లెక్కన మొన్నటి ఎన్నికల దాకా జనసేనకు ఓ మోస్తరుగా ఓల్ల శాతం దక్కినా..వచ్చిన సీట్ల సంఖ్య కేవలం ఒక్కటే. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల దాకా జనసేన కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే ఉండిపోయిది.
అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఏకంగా 22 ఎమ్మెల్యే సీట్లతో పాటుగా 2 ఎంపీ సీట్లను కూడా గెలిచింది. అంతేకాకుండా పోటీ చేసిన అన్ని సీట్లలోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అంటే వంద శాతం స్ట్రైక్ రేట్ అన్న మాట.
ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఫలితాలను పరిశీలించిన ఎన్నికల సంఘం… ఈ దఫా జనసేనకు దక్కిన సీట్లను పరిగణనలోకి తీసుకుని ఆ పార్టీని గుర్తింపు కలిగిన పార్టీల జాబితాలోకి చేర్చింది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం మంగళవారం జనసేనకు ఓ లేఖ ద్వారా తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పార్టీలకు కేటాయించిన గుర్తులు.. ఇతరులకు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులకు కేటాయిచిన గాజు గ్లాసు గుర్తును కొన్ని ప్రాంతాల్లో… జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో ఇతరులకు కేటాయించింది.
అయితే తాజాగా దక్కిన గుర్తింపు కలిగిన పార్టీ హోదా కారణంగా…ఇకపై జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇకపై ఇతరులకు కేటాయించరు. జనసేన పోటీలో లేకున్నా కూడా ఆ గుర్తును ఇతరులకు కేటాయిచరన్న మాట.
This post was last modified on January 21, 2025 10:04 pm
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…