టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో నెలకొన్న వివాదాన్ని బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీ లత అంత ఈజీగా ముగించేందుకు ససేమిరా అంటున్నారు. ఈ వివాదంలో జేసీ ఇప్పటికే సారీ చెప్పినా… ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేసి ఆపై సారీ అంటే సరిపోతుందా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ కు ఫిర్యాదు చేసిన మాధవీ లత… తాజాగా మంగళవారం నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె తన ఫిర్యాదులో పోలీసులను కోరారు.
ఈ న్యూ ఇయర్ నాడు తాడిపత్రిలో మహిళలకు మాత్రమే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశానన్న జేసీ… మహిళలంతా అక్కడికి రావాలంటూ ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చూసినంతనే మాధవీ తల ఫైరైపోయారు. జేసీ కార్యక్రమానికి మహిళలు ఎవ్వరూ వెళ్లొద్దంటూ ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అంతేకాకుండా జేసీ ఎంపిక చేసిన ప్రదేశం ఆకతాయిలకు అడ్డా అని… అక్కడ మహిళలకు భద్రత ఉండదని కూడా చెప్పారు. మాధవీ లత వీడియోపై జేసీ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.
నేరుగా మాధవీ లత కేరెక్టర్ నే టార్గెట్ చేసిన జేసీ… ఆమెను ఓ వ్యభిచారిణిగా అభివర్ణించారు. ఓ సినిమా షూటింగ్ కోసం తాడిపత్రి వచ్చిన మాధవీ లత.. ఎలాంటి నిర్వాకాలు చేసిందో అందరికీ తెలుసునని కూడా ఆయన అన్నారు. మాధవీ లత లాంటి వారు కూడా తాడిపత్రి కల్చర్ గురించి మాట్లాడితే సహించేది లేదని కూడా ఆయన ఫైరయ్యారు. ఏమైందో తెలియదు గానీ… ఆ తర్వాత జేసీనే తన వ్యాఖ్యలపై సారీ చెప్పారు. మాధవీ లతపై తాను అలా మాట్లాడాల్సింది కాదని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తనది తప్పేనని, అందుకు తాను సారీ చెబుతున్నానని జేసీ చెప్పారు.
జేసీ సారీ చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన మాధవీ లత బోరుమని విలపించారు. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గానే ఉన్నా.. ఇటీవలే ఫిల్మ్ ఛాంబర్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా మంగళశారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసిన మాధవీ లత.. జేసీపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. .జేసీ వ్యాఖ్యలతో తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా బూతులు మాట్టాడేసి… ఆపై సారీ చెబితే సరిపోతుందా? అంటూ ఆమె లాజిక్ తీశారు. తనను అసభ్యకర పదజాలంతో దూషించిన జేసీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె తన ఫిర్యాదులో పోలీసులను కోరారు. మరి మాధవీ లత ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on January 21, 2025 3:22 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…