Political News

లోకేశ్ కు డిప్యూటీ ఇచ్చి తీరాల్సిందేనా..?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ కు ప్రమోషన్ ఇవ్వాలంటూ ఇటీవలి కాలంలో టీడీపీలో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్లు, వాటిని వినిపిస్తున్న నేతలను చూస్తుంటే… లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి తీరక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ కేబినెట్ లో మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే లోకేశ్ కు కూడా డిప్యూటీ సీఎం ఇచ్చినా… పెద్దగా ఇబ్బందేమీ రాదన్న వాదనా లేకపోలేదు.

వాస్తవానికి డిప్యూటీ సీఎం పదవికి లోకేశ్ అర్హత ఉన్న నేతే. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీని ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా లోకేశ్ ఓ భారీ కసరత్తే చేశారు. యువగళం పేరిట పాదయాత్ర చేపట్టారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులపై ఎక్కడ దాడులు జరిగినా… ఆయా ప్రాంతాలకు పరుగులు పెట్టారు. బాధితులకు అండగా నిలిచారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోశారు. ఈ దఫా టీడీపీని అధికారంలోకి తీసుకుని వస్తానని బారికి భరోసా ఇచ్చారు. అనుకున్నట్లుగానే… 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి రికార్డు విజయాన్ని అందించారు. ఈ లెక్కన డిప్యూటీ సీఎం పదవికి లోకేశ్ అర్హులేనని ఒప్పుకుని తీరాలి.

ఏపీ కేబినెట్ లో విద్య, ఐటీ వంటి కీలకశాఖల మంత్రిగా కొనసాగుతున్న లోకేశ్ కు ప్రమోషన్ కల్పించాలని, మంత్రి పదవి కంటే ఉన్నతమైన డిప్యూటీ సీఎం పోస్టు ఆయనకు ఇవ్వాలని తొలుత టీడీపీ సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపించాయి. తాజాగా ఆ డిమాండ్లు పార్టీకి చెందిన కీలక నేతలు…అది కూడా ఒకింత సీనియర్ మోస్ట్ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు కడప జిల్లా వెళ్లగా.. అక్కడ వేదిక మీదే…టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి… తన మనసులోని మాటను బయటపెట్టారు. లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని తామంతా కోరుకుంటున్నామని ఆయన చంద్రబాబుకు సభాముఖంానే చెప్పేశారు.

తాజాగా ఇదే డిమాండ్ టీడీపీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నుంచి కూడా వినిపించింది. నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి… చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆది నుంచీ చంద్రబాబుతోనే కలిసి సాగుతున్న సోమిరెడ్డి ఉన్నట్టుండి… ఆదివారం లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పోస్టుకు లోకేశ్ అర్హులని, కార్యకర్తలంతా అదే కోరుకుంటున్నారని కూడా ఆయన గుర్తు చేశారు. యువగళంతో లోకేశ్ తన సత్తా ఏమిటన్న దానిని నిరూపించుకున్నారని కూడా సోమిరెడ్డి గుర్తు చేశారు.

ఇక తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, మొన్నటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కోసం సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ… లోకేశ్ కోసం మరింత గట్టిగా గళం విప్పారు. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన వర్మ..అందుకు ఓ లాజిక్ ను కూడా వినిపించారు. పవన్ కల్యాణ్ ను జన సైనికులు సీఎం అని పిలుచుకుంటూ ఉంటారని, అంతేకాకుండా సీఎంగా పవన్ ఉండాలని కోరుకుంటారని ఆయన తెలిపారు. అలాంటప్పుడు తమ యువ నేత లోకేశ్ డిప్యూటీ సీఎం కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కేదాకా… టీడీపీ శ్రేణుల నుంచి ఈ డిమాండ్ అంతకంతకూ పెరిగిపోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on January 20, 2025 2:30 am

Share
Show comments

Recent Posts

‘ఎయిర్ బస్’ రూటు మనవైపు తిరిగేనా?

దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…

4 hours ago

ఏపీకి ‘ట్రిపుల్’ భరోసా దక్కింది!

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన వైనం… ఏపీని పెను కష్టాల్లో పడేసింది. వచ్చే ఆదాయంతా తెలంగాణకు వెళ్లగా… ఆదాయ…

8 hours ago

అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు

సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…

8 hours ago

అమిత్ షాను చూస్తే నాకు అసూయ: చంద్రబాబు

ఏమిటేమిటీ….? టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నోట నుంచి ఇంత మాట వినిపించిందా? బీజేపీలో అగ్ర నేతగా,…

10 hours ago

బాబు అసహనంతో దిగొచ్చిన కేంద్రం…?

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కుకు…

12 hours ago

టీడీపీలో సీనియ‌ర్ల రాజ‌కీయం.. బాబు అప్ర‌మ‌త్తం కావాలా?

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం…

13 hours ago