పెట్టుబడుల వేటలో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డ నుంచి తీపి కబురు అందింది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో గులాబీ దళపతి కేసీఆర్ చేయలేని పనిని… తెలంగాణ సీఎంగా పరిష్కరించే అవకాశం రేవంత్ సొంతం చేసుకున్నారు. న్యూ ఇయర్ కానుక అన్నట్లుగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రేవంత్ రెడ్డి ఇటీవలి ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందనే సూచనను ఇచ్చింది.
తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంతో భేషజాలు ఉండవని పలుమార్లు స్పష్టం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఢిల్లీలో మూడు రోజుల పాటు బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే. పలువురు కేంద్ర మంత్రులను కలిసి వివిధ కీలక అంశాలపై ప్రతిపాదనలు అందించారు. పలు సమస్యల పరిష్కారాలు కోరారు. తాజాగా ఈ పర్యటన ఫలితం కనిపిస్తోందని సమాచారం. కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ని కలిసిన సీఎం రేవంత్ తెలంగాణలో పెండింగులో ఉన్న 161 ప్రాజెక్టుల విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. సీఎం వచ్చి వినతిపత్రం ఇవ్వడంతో కేంద్ర మంత్రి స్పందించి అధికారులకు పరిష్కార మార్గాలకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చారు. దీంతో డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్ కేంద్ర ప్రభుత్వం తరఫున రంగంలోకి దిగారు.
అటవీశాఖ అనుమతులు పెండింగులో ఉండడం వల్ల తెలంగాణలో ఆగిపోయిన ప్రాజెక్టులపై చర్చించేందుకు కేంద్రమంత్రి ఆదేశంతో డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్ హైదరాబాద్ విచ్చేశారు. ఉదయం 10 గంటలకు అరణ్య భవన్లో తన నాయకత్వంలోని కేంద్ర బృందంతో సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఏ అంశాలలో సమస్యలు ఏర్పడి ప్రాజెక్టులు పెండింగ్లో పడ్డాయి, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నిర్ణయాలు వెలువడనున్నాయి. దీంతో కీలక ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందని సమాచారం.
కాగా, ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని అంటున్నారు. గత పదేండ్లు కేంద్రంతో పేచీలు పెట్టుకొని తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ సహకరించలేదని ఆరోపిస్తూ ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించారు. పెండింగులో ఉన్న ప్రాజెక్టుల విషయంపై కేంద్రంతో మాట్లాడేందుకు సిద్ధమై ఇటీవలే కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయిన సీఎం రేవంత్ ఈ విషయంలో రాష్ట్ర అటవీ శాఖ అధికారుల తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి చూపిన చొరవ వల్లే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చారని, ఈ మేరకు సమస్యకు పరిష్కారాలు లభించనున్నాయని పేర్కొంటున్నారు.
This post was last modified on January 18, 2025 12:37 pm
మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30…
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... బీజేపీ మహిళా నేత, సినీ…
ఏదైనా పెద్ద సినిమాకు సంగీత దర్శకుడిని ఎంచుకునే పని స్టార్ హీరోల దర్శకులకు పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో…