Political News

కూట‌మి స‌ర్కారుపై వ్య‌తిరేక‌త లేదు.. కానీ ..!

ఏపీలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి ఏడు మాసాలు అయిపోయింది. జ‌న‌వ‌రి 12వ తేదీకి కూట‌మి స‌ర్కారుకు ఏడు మాసాలు నిండాయి. ఏడు మాసాల కాలంలో అనేక ఇబ్బందులు.. స‌వాళ్ల‌ను ఎదుర్కొన‌క త‌ప్ప‌లేదు. వ‌ర‌ద‌లు, విప‌త్తులు, తిరుప‌తి తొక్కిస‌లాట‌, విశాఖ ఫార్మా మృతులు, తిరుమ‌ల ల‌డ్డూ వివాదం.. ఇలా.. కొన్ని ఇబ్బందులు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల మేర‌కు.. ఉచిత గ్యాస్ ప‌థ‌కా న్ని ప్రారంభించారు. అదేవిధంగా పింఛ‌న్ల‌ను పెంచారు.

డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇవ్వాల్సి ఉంది. ఇది సంక్షేమం ప‌రంగా నాణేనికి ఒక‌వైపు అనుకుంటే చేయాల్సింది చాలానే ఉంది. అయితే.. సంక్షేమం క‌న్నా.. అభివృద్ధి అజెండాను కూట‌మి స‌ర్కారు ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అదేవిధంగా పెట్టుబడుల ఆక‌ర్ష‌ణ‌పైనా ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. పోల‌వ‌రం స‌హా మెట్రో రైలు ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్ వంటి వాటిని తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తోంది.

ఈ ప‌రిణామాలు.. కూట‌మి స‌ర్కారుపై బాగానే ప‌నిచేస్తున్నాయి. అయితే.. కీల‌క‌మైన మూడు ప‌థ‌కాల విషయంలో కూట‌మి ప్ర‌భుత్వం మౌనంగా ఉండ‌డంపై మాత్రం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌సాగుతోంది. ఉచిత బ‌స్సు, మ‌హిళ‌ల‌కు రూ.1500 ఇచ్చే ప‌థ‌కం, రైతుల‌కు భ‌రోసా ఈ మూడు ప‌థ‌కాల విష‌యం స‌ర్కారుకు కీల‌కంగా మారింది. అధికారంలోకి వ‌చ్చి ఏడు మాసాలైనా ఈ ప‌థ‌కాల‌పై మాత్రం స‌ర్కారు ఇంకా ప్ర‌క‌ట‌న చేయలే దు. అయితే, క్షేత్ర‌స్థాయిలో వీటిని అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్న సంకేతాలు పంపించారు.

దీంతో ప్ర‌జ‌ల్లో కొంత నిబ్బ‌రం క‌నిపిస్తోంది. అంటే.. ఏడు మాసాల పాల‌న‌లో స‌ర్కారుపై పూర్తిగా వ్య‌తిరేక‌త అయితే రాలేదు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఒకింత అసంతృప్తి అయితే క‌నిపిస్తోంది. ఉచిత ఇసుక అన్నా కూడా.. డ‌బ్బులు పెట్టి కొనాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. బెల్ట్ షాపులు ఉండ‌వ‌ని చెప్పినా.. వీధిలో నాలుగు బెల్టు షాపులు ఏర్ప‌డ్డాయి. ఈ ప‌రిణామాలు మాత్రం స‌ర్కారుపై అసంతృప్తి పెరిగేలా చేస్తున్నాయి. కానీ, ఇప్ప‌టికిప్పుడు ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ప్ర‌తిప‌క్ష వైసీపీ చేస్తున్న ప్ర‌చారం స్థాయిలో అయితే వ్య‌తిరేక‌త లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 17, 2025 10:48 am

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

19 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago