తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ పగ్గాల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. పార్టీ అధినే త కేసీఆర్ ప్రజల మధ్యకు రావడం లేదు. పైగా ఆయన కొంత అస్వస్థతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలకు షెడ్యూల్ విడుదల చేస్తున్నా.. ఆయన మాత్రం హాజరు కాలేక పోతున్నారు. దీంతో పార్టీలో కేసీఆర్ ప్రభావం తగ్గుతోందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు.. ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ దూకుడు పెంచారు.
పార్టీ తరఫున కార్యక్రమాలు కానీ, అసెంబ్లీలో పాలక పక్షాన్ని ఎండగట్టే విషయంలో కానీ.. కేటీఆర్ సమర్థ వంతంగా దూసుకుపోతున్నారన్న చర్చ కూడా పార్టీలో సాగుతోంది. ఇదేసమయంలో సానుభూతి రాజకీయాల్లోనూ కేటీఆర్ ముందున్నారు. ప్రభుత్వంలో సై అంటే సై అనే విధంగా కేటీఆర్ సవాళ్లు రువ్వడం.. తనపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించడం, ప్రజా సమస్యలను ప్రస్తావించడం వంటివి గత మూడు మాసాల్లో కేటీఆర్ గ్రాఫ్‌ను పెంచాయి.
దీంతో కేటీఆర్ చుట్టూ.. పార్టీ పగ్గాల చర్చ జోరుగా సాగుతోంది. గతంలో అయితే.. హరీష్‌రావు పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. పార్టీ కోసం ఆయన కూడా కృషి చేశారని, ఉద్యమ సమయంలో కేసులు కూడా ఎదుర్కొన్నారని నాయకులు చెప్పుకొచ్చారు. నిజానికి ఆరు మాసాల కిందట హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ మధ్య పార్టీ పగ్గాల విషయంలో కోల్డ్ వార్ జరుగుతోందన్న చర్చ కూడా వచ్చింది. కానీ, అనూహ్యంగా గత మూడు మాసాల్లో కేటీఆర్‌దూకుడు పెంచారు.
హైడ్రా, ఫార్ములా ఈ-రేస్ వంటి విషయాల్లో కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ప్రత్యక్ష యుద్ధమే సాగింది. ఇది కేటీఆర్‌కు మరిన్ని మంచి మార్కులు పడేలా చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేప థ్యంలో బీఆర్ ఎస్‌కు సరైన నాయకుడు, పార్టీని ముందుండి నడిపించే సత్తా కేటీఆర్ లో ఉందని నిజా మాబాద్‌కు చెందిన కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఈ విషయం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే దసరాలోపు పార్టీ పగ్గాలు అప్పగించినా ఆశ్చర్యం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరిఏం జరుగుతుందోచూడాలి.
This post was last modified on January 14, 2025 12:27 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…