టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నిజంగానే ప్రజలతో పటు ఉద్యోగులు కూడా ఫుల్ ఖుషీగా ఉంటారని చెప్పొచ్చు. ఇతర సీఎంల మాదిరిగా కాకుండా ఉద్యోగులు ఏది అడిగినా చంద్రబాబు కాదనరనే మాట చాలా కాలం నుంచే వినిపిస్తోంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఇందుకు సంక్రాంతి సందర్బంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
చంద్రబాబు సీఎం అయ్యేనాటికి ఏపీ ఖజానా దాదాపుగా ఖాళీగా ఉంది. ఫలితంగా ఏ పని చేయాలన్న చంద్రబాబు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వచ్చేది. ఆర్ధిక ఇబ్బంది ఉందని పండుగలు పబ్బాలు ఆగవు కదా. చంద్రబాబు సర్దుకోక ముందే సంక్రాంతి వచ్చేసింది.
సంక్రాంతికి కూడా తమను పట్టించుకోరా అన్నట్టుగా ఉద్యోగులు చంద్రబాబు వైపు చూసారు. పరిస్థితిని గమనించిన చంద్రబాబు.. రూ.6 వేల కోట్లకు పైగా నిధులను ఆయా వర్గాలకు విడుదల చేసారు. ఇందులో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు అధికంగా ఉన్నాయి.
కష్టకాలంలోనూ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఫుల్ ఖుష్హే అయ్యారు. తాజాగా బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ల ప్రతినిధులు చంద్రబాబుకు ఓ విషయాన్ని విన్నవించారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న తరుణంలో తమకు కేవలం ఒక్కరోజు మాత్రమే సెలవు ఇస్తే ఎలా అని… కనుమ రోజు కూడా తమకు సెలవు కావాలని కోరారు.. దీంతో… ఈ విషయంపై వెంటనే దృష్టి సారించిన చంద్రబాబు… కనుమ రోజున కూడా బ్యాంకులకు సెలవు ;ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంపై బ్యాంకు ఉద్యోగులు హర్షం ప్రకటించారు.
This post was last modified on January 14, 2025 10:54 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…